NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో..
    తదుపరి వార్తా కథనం
    ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో..
    ఇండియా నుండి ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో రెండు సినిమాలు

    ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో..

    వ్రాసిన వారు Sriram Pranateja
    Dec 22, 2022
    11:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల మహోత్సవం మరో మూడు నెలల్లో ఉండనుంది. ఈ మూడు నెలల ముందు నుండే ఆస్కార్ సందడి మొదలైంది.

    ఈరోజు 10 విభాగాల్లో షార్ట్ లిస్టులను ప్రకటించింది. అందులో బెస్ట్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట చోటు దక్కించుకుంది.

    అలాగే ఇంటర్నేషన్ ఫీఛర్ ఫిలిమ్ విభాగంలో ఇండియా నుండి పంపిన గుజరాతీ ఫిలిమ్ "ఛెల్లో షో" (లాస్ట్ ఫిలిమ్) కూడా షార్ట్ లిస్ట్ అయ్యింది.

    బెస్ట్ సాంగ్ విభాగంలో పదిహేను పాటలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. అందులో అవతార్ 2 సినిమాలో నథింగ్ ఈజ్ లాస్ట్ తో పాటు టాప్ గన్ మావ్ రిక్ సినిమాలోని హోల్డ్ మై హ్యాండ్ కూడా ఉంది.

    ఆస్కార్ అవార్డ్స్

    ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ అందుతుందా?

    ప్రస్తుతానికి పది కేటగిరీల నుండి మాత్రమే షార్ట్ లిస్ట్ వచ్చింది. మిగిలిన విభాగాల నుండి ఇంకా రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే, షార్ట్ లిస్ట్ అయిన సినిమాలకు జనవరి 12,13,14 తేదీల్లో ఓటింగ్ ఉంటుంది.

    ఏ సినిమాలకైతే ఎక్కువ ఓట్లు వస్తాయో అవి నామినేషన్ లో ఉంటాయి. జనవరి 24వ తేదీన నామినేట్ అయిన జాబితాను ప్రకటించనుంది ఆస్కార్.

    మార్చ్ 12వ తేదీన హాలీవుడ్ లో డాల్బీ థియేటర్ లో ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అందుకుంటుందని అందరూ అనుకుంటున్నారు.

    ప్రస్తుతానికి ప్రపంచ సినిమా అవార్డుల వేదికల మీద ఆర్ఆర్ఆర్ తన సత్తా చాటింది. ఆస్కార్ కూడా అందుకుని ప్రపంచ వేదిక మీద తెలుగు సినిమా సత్తా చూపిస్తుందేమో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025