Loading...
Zoho Catalyst: విద్యార్థులకు జోహో గుడ్‌న్యూస్‌.. 'క్యాటలిస్ట్‌' సేవలు ఇక పూర్తిగా ఉచితం!
విద్యార్థులకు జోహో గుడ్‌న్యూస్‌.. 'క్యాటలిస్ట్‌' సేవలు ఇక పూర్తిగా ఉచితం!

Zoho Catalyst: విద్యార్థులకు జోహో గుడ్‌న్యూస్‌.. 'క్యాటలిస్ట్‌' సేవలు ఇక పూర్తిగా ఉచితం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 03, 2026
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ గ్లోబల్‌ టెక్నాలజీ సంస్థ జోహో విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. తమ స్వదేశీ సర్వర్‌లెస్‌ ప్లాట్‌ఫామ్‌ 'క్యాటలిస్ట్‌' సేవలను విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్‌ సైంటిస్ట్‌ శ్రీధర్‌ వెంబు వెల్లడించారు. క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఖర్చుల గురించి ఆందోళన చెందకుండా యువ డెవలపర్లు రియల్‌-టైమ్‌ అప్లికేషన్లను అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

వివరాలు

సొంత క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో జోహో

అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (AWS), గూగుల్‌ క్లౌడ్‌ వంటి విదేశీ టెక్నాలజీ దిగ్గజాలపై ఆధారపడకుండా జోహో సంస్థ తొలినాళ్లలోనే సొంత క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించుకుంది.

డేటాబేస్‌లు, ఐడెంటిటీ, మెసేజింగ్‌, సెర్చ్‌, స్టోరేజ్‌, కంప్యూట్‌ వ్యవస్థలను సొంతంగా రూపొందించుకుంది.

ఈ అంతర్గత సాంకేతికత ఆధారంగానే 'క్యాటలిస్ట్‌' ప్లాట్‌ఫామ్‌ రూపుదిద్దుకుంది.

తొలుత జోహో ఉత్పత్తుల విస్తరణ కోసం రూపొందించిన ఈ సర్వర్‌లెస్‌ ప్లాట్‌ఫామ్‌.. ప్రస్తుతం ఇతర డెవలపర్ల నుంచి కూడా ఆదరణ పొందుతోంది.

వివరాలు

'విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం'

'మనం మన సొంత క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించుకున్నాం. విద్యార్థులు తమ ఆలోచనలను నిజమైన ఉత్పత్తులుగా మార్చడానికి అవసరమైన మౌలిక వసతులను కల్పించడమే మా ముఖ్య లక్ష్యమని శ్రీధర్‌ వెంబు అన్నారు.

విద్యార్థులకు సాంకేతికతను ఉచితంగా అందించడం ద్వారా భారతదేశంలో ఆవిష్కరణల వేగం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మౌలిక వసతుల కోసం అదనపు ఖర్చులు లేకుండా కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌ నేర్చుకునే వారికి జోహో తీసుకున్న ఈ నిర్ణయం మెరుగైన అవకాశంగా మారనుంది.

ADVERTISEMENT