NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / వాల్తేరు వీరయ్య: ప్రమోషన్లలో ఆలస్యం.. కారణం అదే
    తదుపరి వార్తా కథనం
    వాల్తేరు వీరయ్య: ప్రమోషన్లలో ఆలస్యం.. కారణం అదే
    వాల్తేరు వీరయ్యలో చిరంజీవి

    వాల్తేరు వీరయ్య: ప్రమోషన్లలో ఆలస్యం.. కారణం అదే

    వ్రాసిన వారు Sriram Pranateja
    Dec 23, 2022
    05:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి రెడీ అవుతోంది. 2023 జనవరి 13వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఐతే ప్రచార పనులు మాత్రం పెద్ద ఎత్తున ఇంకా మొదలు కాలేదు.

    చాలారోజుల తర్వాత సంక్రాంతి బరిలో తన సినిమాను దించుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. దాంతో అటు సినిమా ఇండస్ట్రీ వాళ్లతో పాటు చిరంజీవి అభిమానులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు.

    ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు విడుదలయ్యాయి. బాస్ పార్టీ బాంబ్ లా పేలితే శ్రీదేవి పాట సున్నితంగా ఎక్కింది.

    శ్రీదేవి పాటను ఫ్రాన్స్ లోని మంచు పర్వతాల్లో చిత్రీకరణ చేసినట్లు వీడియో కూడా రిలీజ్ చేసారు. ప్రస్తుతం మూడవ పాట రిలీజ్ కి సిద్ధం అవుతోంది.

    మెగాస్టార్ చిరంజీవి

    సోమవారం నుండి రంగంలో దూకనున్న చిరంజీవి.

    అటు పాటల చిత్రీకరణ, ఇటు డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఇప్పటి వరకు సినిమా ప్రమోషన్లలోకి చిరంజీవి దిగలేదు. ప్రస్తుతం ఆ పనులన్నీ పూర్తయిపోయినట్లు తెలుస్తోంది.

    సోమవారం నుండి వాల్తేరు వీరయ్య ప్రమోషన్లలో చిరంజీవి పాల్గొంటారని వినిపిస్తోంది. ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారట.

    మొత్తానికి వాల్తేరు వీరయ్య ప్రమొషన్లు సోమవారం నుండి మొదలై ట్రైలర్ లాంచ్ తో పీక్స్ కి చేరుకుంతాయని అర్థమవుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

    బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మరి ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చిరంజీవి
    టాలీవుడ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    చిరంజీవి

    డ్రగ్ మాఫీయాపై ఉక్కుపాదం.. గ్యాంగ్ స్టర్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు చలికాలం
    రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం టాలీవుడ్

    టాలీవుడ్

    ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో.. రాంచరణ్
    సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత సినిమా
    ఎన్టీఆర్ తో కైకాల అనుబంధం.. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో సినిమా
    2022 రివైండ్: బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డ చిత్రాలు తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025