NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / వీరసింహారెడ్డి: బాలయ్య మనోభావాలు దెబ్బతిన్నాయి
    తదుపరి వార్తా కథనం
    వీరసింహారెడ్డి: బాలయ్య మనోభావాలు దెబ్బతిన్నాయి
    బావ మనోభావాలు దెబ్బతిన్నాయి ప్రోమో విడుదల

    వీరసింహారెడ్డి: బాలయ్య మనోభావాలు దెబ్బతిన్నాయి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Dec 24, 2022
    09:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అఖండ సినిమా విజయం తర్వాత బాలయ్య నుండి వస్తున్న వీరసింహారెడ్డి అనే సినిమా వస్తోంది. ఈ సినిమాపై అభిమానుల అంచనాలు హై లెవెల్లో ఉన్నాయి.

    సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుండి వరుసగా పాటలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. జై బాలయ్య పాటతో పాటు సుగుణ సుందరి పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

    సుగుణ సుందరి పాటలో బాలకృష్ణ స్టెప్పులకు అభిమానులు ఫిదా ఐపోయారు. ప్రస్తుతం ఈ సినిమా నుండి మూడవ పాట రిలీజ్ కి సిద్ధం అవుతోంది.

    ఈ మేరకు ప్రకటనతో పాటు ప్రోమో వదిలారు. బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ సాగే ప్రోమోలో చంద్రిక రవితో స్టెప్పులేసాడు బాలయ్య.

    బాలయ్య

    ఆస్ట్రేలియా అమ్మాయితో స్టెప్పులు

    భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా అమ్మాయి చంద్రిక రవి, బాలయ్యతో అదిరిపోయే స్టెప్పులేసింది. మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ప్రోమో ఇచ్చారు. అవి ఎందుకు దెబ్బతిన్నాయో తెలుసుకోవాలంటే పాట రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే అని తెలుస్తోంది.

    ప్రోమో ఇంట్రెస్టింగ్ గా ఉంది. థమన్ సంగీతం కూడా బాగుంది. శేఖర్ మాస్టర్ స్టెప్పులు అదనపు ఆకర్షణ. మొత్తానికి వీరసింహారెడ్డి నుండి వస్తున్న మూడవ పాట కూడా ఛార్ట్ బస్టర్ అయ్యేలా కనిపిస్తోంది.

    ఈ పాట మాస్ జనాలకు ఎక్కువ కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈరోజు మధ్యాహ్నాం 3:19గంటలకు మొత్తం పాటను రిలీజ్ చేస్తామని తెలిపారు.

    మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    టాలీవుడ్

    ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో.. జూనియర్ ఎన్టీఆర్
    రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం చిరంజీవి
    సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత సినిమా
    ఎన్టీఆర్ తో కైకాల అనుబంధం.. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025