NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / కొత్త సంవత్సరంలో ఏం చేయాలో చెబుతూ సమంత ఎమోషనల్ పోస్ట్
    తదుపరి వార్తా కథనం
    కొత్త సంవత్సరంలో ఏం చేయాలో చెబుతూ సమంత ఎమోషనల్ పోస్ట్
    ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సమంత

    కొత్త సంవత్సరంలో ఏం చేయాలో చెబుతూ సమంత ఎమోషనల్ పోస్ట్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Dec 30, 2022
    12:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    స్టార్ హీరోయిన్ సమంత, యశోద సినిమా విడుదల సమయంలో తన అనారోగ్యం గురించి అందరి ముందు బయటపెట్టింది. ఆటో ఇమ్యూన్ వ్యాధిరకమైన మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది సమంత.

    శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ, ఆ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాల మీద దాడిచేసే పరిస్థితినే ఆటో ఇమ్యూన్ అంటారు. ఇది చాలా రకాలుగా ఉంటుంది. ఈ విషయమై ఎక్కువ వివరాలు వెల్లడించలేదు సమంత.

    సమంత అనారోగ్యం గురించి తెలియగానే అభిమానులు అందరూ చాలా బాధపడ్డారు. సమంత ధైర్యం చెబుతూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపించారు.

    ఐతే గత కొన్ని రోజులుగా సమంత సోషల్ మీడియాలో ఎక్కువగా కనబడటం లేదు. దాంతో అభిమానుల్లో అందోళన ఎక్కువైంది. తన ఆరోగ్యం ఎలా ఉందోనని ఆలోచించారు.

    సమంత రుతుప్రభు

    మీవల్ల అయ్యే తీర్మానాలనే లక్ష్యంగా పెట్టుకోండి

    ప్రస్తుతం ఇన్స్టాలో దర్శనమిచ్చింది సమంత. మేకప్ లేకుండా దిగిన ఫోటోను అందరితో పంచుకుంది. కొత్త సంవత్సర తీర్మానాలుగా ఎలాంటి వాటిని సెట్ చేసుకోవాలో తెలిపింది.

    మనవల్ల సులభంగా అయ్యే పనులు, కొత్త పనులను తీర్మానాలుగా సెట్ చేసుకోవాలి. అవి మనమీద చెడు ప్రభావం చూపకుండా, మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని సూచించింది.

    చాలారోజుల తర్వాత సోషల్ మీడియాలో సమంత దర్శనమివ్వడంతో, అందరూ తన హెల్త్ గురించి ఆరా తీసారు. కొందరేమో, మీరు తొందరగా కోలుకుంటారని, మీకోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.

    ఇటీవల హీరో రాహుల్ రవీంద్రన్, సమంతకు ధైర్యం చెబుతూ ఒక సందేశాత్మక వ్యాక్యాలతో ఉన్న ఫోటో ఫ్రేమ్ ని బహుమతిగా అందించారు. ఈ విషయం సమంత స్వయంగా వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్
    సమంత రుతు ప్రభు
    తెలుగు సినిమా

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    టాలీవుడ్

    ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో.. రాంచరణ్
    రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం చిరంజీవి
    సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత సినిమా
    ఎన్టీఆర్ తో కైకాల అనుబంధం.. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో సినిమా

    సమంత రుతు ప్రభు

    సమంతకు ధైర్యం చెబుతూ రాహుల్ రవీంద్ర గిఫ్ట్.. ఆందోళనలో అభిమానులు టాలీవుడ్

    తెలుగు సినిమా

    2022 రివైండ్: బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డ చిత్రాలు టాలీవుడ్
    మహేష్ తో సినిమాపై శ్రీలీల మౌనం... కారణం అదేనా? టాలీవుడ్
    బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల టాలీవుడ్
    తెలుగు సినిమాల దెబ్బా.. తమిళ సినిమాలు అబ్బా టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025