బర్త్ డే స్పెషల్: తీయనైన తెలుగులో మహ్మద్ రఫీ పాట.. తేనెకన్నా మధురం
ఈ వార్తాకథనం ఏంటి
1970, 80ల్లో మీకు ఏ సింగర్ ఇష్టమని ఎవరినైనా అడిగితే భాషతో సంబంధం లేకుండా అందరూ మహ్మద్ రఫీ అని చెప్పేవారు. ఆ గొంతులో ఉన్న మాధుర్యానికి అంతగా పరవశించిపోయారు.
చాలా సినిమాలు మహ్మద్ రఫీ పాటలతోనే పాపులర్ అయ్యాయంటే అతిశయోక్తి కాదు. ఆయన పుట్టినరోజు ఈరోజు. హిందీ సినిమా పాటలకే ఎక్కువగా తన గొంతును అందించిన మహ్మద్ రఫీ, తెలుగులోనూ పాటలు పాడారు.
మహ్మద్ రఫీ పాడిన తెలుగు పాటల గురించి చెప్పుకోవాలంటే సీనియర్ ఎన్టీఆర్ సినిమాల గురించి చెప్పుకోవాలి.
ఆరాధన సినిమాలో ఎన్టీఆర్ కి పాడిన, "నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై" అనే పాట ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.
మహ్మద్ రఫీ
తెలుగు పాటలకు తనదైన గొంతునిచ్చాడు
అంతేకాదు, సలీమ్ అనార్కలీ సినిమాలో మహ్మద్ రఫీ పాడిన "ఓ హసీనా" అనే పాట కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మహ్మద్ రఫీ తన మొదటి తెలుగు పాటను "పదండి ముందుకు" సినిమా కోసం పాడారు.
కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన భలే తమ్ముడు సినిమాలో పాడిన "ఎంతవారు గానీ వేదాంతులైన గానీ వాలుచూపు సోకగానే తేలిపోదురోయ్" అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత వరుసగా ఎన్టీఆర్ సినిమాలకు పాటలు పాడారు. ఎన్టీఆర్ కే కాదు చాలామంది హీరోలకు తన గొంతుతో అందమైన పాటలు అందించాడు.
పంజాబ్ లో జన్మించి, హిందీ సినిమాల్లో ఎక్కువ పాటలు పాడిన మహ్మద్ రఫీ, తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.