NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బాహుబలిని ఫాలో అవుతున్న పొన్నియన్ సెల్వన్.. రెండో భాగం విడుదల తేదీ ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    బాహుబలిని ఫాలో అవుతున్న పొన్నియన్ సెల్వన్.. రెండో భాగం విడుదల తేదీ ప్రకటన
    పొన్నియన్ సెల్వన్ 2 విడుదల తేదీ ప్రకటన

    బాహుబలిని ఫాలో అవుతున్న పొన్నియన్ సెల్వన్.. రెండో భాగం విడుదల తేదీ ప్రకటన

    వ్రాసిన వారు Sriram Pranateja
    Dec 28, 2022
    06:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాహుబలి సినిమాతో దేశంలో పెద్ద సంచలనం చెలరేగింది. పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా వర్కౌట్ అవుతాయని చూపించిన సినిమా అది. అందుకే అప్పటి నుండి అన్ని ఇండస్ట్రీల్లోనూ అలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి.

    అలా వచ్చిన సినిమానే పొన్నియన్ సెల్వన్. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా మొదటి భాగం ఈ సంవత్సరం విడుదలై తమిళంలో మంచి విజయం అందుకుంది.

    ఇతర భాషల్లో అనుకున్నంత గుర్తింపు పొందలేకపోయినప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

    విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ, జయం రవి, త్రిష ప్రధాన పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ 2 విడుదల తేదీని ప్రకటించారు.

    పొన్నియన్ సెల్వన్ 2

    బాహుబలి రిలీజ్ తేదీ రోజే రెండవ భాగం విడుదల

    పొన్నియన్ సెల్వన్ 2 రెండవ భాగాన్ని 2023 ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ చిన్న గ్లింప్స్ ని విడుదల చేసింది లైకాస్ ప్రోడక్షన్స్.

    చోళులు వస్తున్నారంటూ వీడియో బైట్ ని రిలీజ్ చేసి విడుదల తేదీని ప్రకటించారు. ఈ విషయమై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

    బాహుబలి 2 రిలీజ్ అయిన ఏప్రిల్ 28వ తేదీనే ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. ఏప్రిల్ 28వ తేదీన విడుదలైన బాహుబలి 2 దాదాపు 2వేల కోట్ల కలెక్షన్లు సాధించింది.

    మరి ఆ తేదీ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి పొన్నియన్ సెల్వన్ 2 కూడా అలాంటి విజయం అందుకుంటుందేమో చూడాలి. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్
    తెలుగు సినిమా

    తాజా

    Viral Video: భారీ వర్షాన్ని లెక్కచేయక పంటను కాపాడుకునేందుకు రైతు ప్రయత్నం.. స్పందించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
    Bangladesh: బంగ్లాదేశ్‌ దిగుమతులపై భారత్‌ ఆంక్షలు.. చర్చలతో పరిష్కరించేందుకు సిద్ధమన్న బంగ్లా బంగ్లాదేశ్
    Nandigama Suresh: నందిగం సురేశ్'కు జూన్ 2 వరకు రిమాండ్ విధించిన కోర్టు వైసీపీ
    Ajit Doval: భారత్-ఇరాన్ మధ్య కీలక చర్చలు.. చాబహార్ పోర్ట్, రవాణా కారిడార్‌పై అజిత్ దోవల్ దృష్టి అజిత్ దోవల్‌

    టాలీవుడ్

    ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో.. రాంచరణ్
    రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం చిరంజీవి
    సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత సినిమా
    ఎన్టీఆర్ తో కైకాల అనుబంధం.. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో సినిమా

    తెలుగు సినిమా

    2022 రివైండ్: బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డ చిత్రాలు టాలీవుడ్
    మహేష్ తో సినిమాపై శ్రీలీల మౌనం... కారణం అదేనా? టాలీవుడ్
    బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల టాలీవుడ్
    తెలుగు సినిమాల దెబ్బా.. తమిళ సినిమాలు అబ్బా టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025