Page Loader
అల్లు అరవింద్ భారీ ఆఫర్.. ఆ సినిమాల్లో హీరో నిఖిల్ కి షేర్
హీరో నిఖిల్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన అల్లు అరవింద్

అల్లు అరవింద్ భారీ ఆఫర్.. ఆ సినిమాల్లో హీరో నిఖిల్ కి షేర్

వ్రాసిన వారు Sriram Pranateja
Dec 30, 2022
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

2022సంవత్సరం హీరో నిఖిల్ కి బాగా కలిసొచ్చింది. ఆగస్టులో కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో విజయం అందుకుని, చివర్లో 18 పేజెస్ తో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. సుకుమార్ రాసిన ప్రేమకథతో వచ్చిన ఈ సినిమా, ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది. దాంతో సినిమా బృందం ఆనందంలో ఉంది. ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఆ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్, నిఖిల్ కి అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడు. అల్లు అరవింద్ మాట్లాడుతూ, నిఖిల్ తో మరో రెండు సినిమాలు చేయాలనుకున్నానని, అందుకోసం నిఖిల్ ని అడిగానని చెప్పారు. కానీ ఒకేసారి రెండు సినిమాలకు నిఖిల్ ఒప్పుకోలేదని అన్నారు.

అల్లు అరవింద్

భాగస్వామిగా ఆఫర్

రాబోయే రెండు సినిమాలకు ఒకేలాంటి రెమ్యునరేషన్ ఉంటుందేమోనని నిఖిల్ ఒప్పుకోలేదు కావచ్చని, ఆ రెండు సినిమాలకు భాగస్వామిగా ఆఫర్ ఇచ్చారు అల్లు అరవింద్. ఈ మేరకు భాగస్వామ్యం మీద బన్నీ వాసు పని చేస్తున్నాడని కూడా చెప్పారు. మొత్తానికి నిఖిల్ కి మంచి అఫర్ దొరికింది. గత కొన్ని రోజులుగా నిఖిల్ ఎంచుకుంటున్న కథలు విభిన్నంగా ఉంటున్నాయి. స్వామిరారా సినిమాతో నిఖిల్ కెరీర్ చాలా మారిపోయింది. ఏదో ఒక కొత్త అంశంతో, ఆకట్టుకునే కథనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దాంతో అతని సినిమాలు మినిమమ్ గ్యారంటీ అన్న నమ్మకం అందరికీ ఏర్పడిపోయింది. మరి అల్లు అరవింద్ ఆఫర్ లో వచ్చే రెండు సినిమాలు ఎప్పుడు మొదలవుతాయో చూడాలి.