షూటింగ్ సెట్లో ప్రభాస్, మారుతి.. ఫోటోలు వైరల్
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉంటుందనగానే ఫ్యాన్స్ అంతా గోలగోల చేసారు. ప్రస్తుతం సినిమా మొదలైంది. ఆల్రెడీ షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ మేరకు ఇంటర్నెట్ లో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. షూటింగ్ సెట్ లో ప్రభాస్, మారుతి ఇద్దరూ సేదదీరుతున్నట్టు కనిపిస్తున్న ఫోటో, ఇంటర్ నెట్ ని షేక్ చేస్తోంది. బ్రేక్ టైమ్ లో వీరిద్దరూ సరదాగా ఉన్నట్టు ఆ ఫోటో చూస్తే అర్థం అవుతోంది. మొత్తానికి మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ప్రారంభమైనట్లే అని అర్థం అవుతోంది. అంతేకాదు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారట. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు ప్రభాస్ సరసన కనిపించనున్నారు. కాకపోతే నిధి అగర్వాల్ ని తీసేసినట్లు వార్త వచ్చింది.
ఈసారి రొమాంటిక్ యాక్షన్ తో బరిలోకి
రాజా డీలక్స్ మూవీ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. సరదా సరదాగా సాగిపోయేలా ఉండే కథని రాసుకున్నాడట మారుతి. బాహుబలి ఘనవిజయం తర్వాత అన్నీ సీరియస్ సినిమాలే చేసాడు ప్రభాస్. సరదా సినిమా చేసి చాలా రోజులైనందు వల్ల మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ తో ఆ ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే. ఈ సినిమా ఎలా ఉండబోతుందన్నది సినిమా నుండి అప్డేట్ వస్తేనేగానీ బయటకు తెలియదు. మరి ఆ అప్డేట్ ఎప్పుడిస్తారో చూడాలి. రాజాడీలక్స్ తో పాటు ప్రభాస్ చేతిలో ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ తయారు చేస్తున్న సలార్, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె కూడా ఉన్నాయి.