సోషల్ మీడియా సాక్షిగా థ్యాంక్స్ చెప్పిన ఉపాసన
రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నారు. ఈ విషయమై అభిమానులు అందరూ హ్యాపీగా ఫీలయ్యారు. సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ తెలిపారు. సినిమా ప్రముఖుల నుండి అభిమానుల వరకూ అందరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఉపాసన అందరికీ థ్యాంక్స్ చెబుతూ ఒక ఫోటోను షేర్ చేసింది. చిన్నపప్పీని చేతిలో పట్టుకుని రామ్ చరణ్, ఉపాసన ఫోటోలు దిగారు. మీరు చూపిన ప్రేమకు థ్యాంక్స్ అన్న అర్థం వచ్చేలా వాక్యాలు రాసింది ఉపాసన. వచ్చే సంవత్సరం ఆగస్టులో మెగా కుటుంబంలో కొత్త బేబీ రాబోతున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు రామ్ చరణ్, ఉపాసనలు థాయ్ లాండ్ టూర్ కి వెళ్లారు.
వైరల్ అవుతున్న ఫోటోలు
ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఫోటో, నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. బిడ్డకు జన్ననివ్వబోతున్నారనే వార్త తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో కనిపిస్తుండడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. రామ్ చరణ్ నుండి ఈ సంవత్సరం వచ్చిన ఆర్ఆర్ఆర్, ప్రపంచ ఆవార్డు వేదికల మీద దుమ్ము దులుపుతోంది. ఆస్కార్ రేసులో దూసుకుపోతున్న ఈ సినిమా ఆస్కార్ అందుకుంటుందనే ఆశతో ఉన్నారు. అదలా ఉంచితే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో సినిమా కన్ఫమ్ అయ్యింది. సుకుమార్ తో కూడా మరో సినిమా లైనప్ లో ఉంది. వీటన్నింటిలో శంకర్ తో చేస్తున్న సినిమా ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.