
ఫిబ్రవరిలో తెలుగు తెర మీద చిన్న సినిమాల సందడి
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు బాక్సఫీసు వద్ద సంక్రాంతి సందడి వేరే లెవెల్లో ఉంటుంది. ప్రతీ ఒక్కరూ తమ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని అనుకుంటారు.
వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లు సంక్రాంతికి రిలీజ్ అవుతుంటే చిన్న సినిమాలన్నీ ఫిబ్రవరిలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే విడుదల తేదీ ప్రకటనలు వెలువడ్డాయి.
ఫిబ్రవరి నెలలో బాక్సాఫీసు ఏడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం ఫిబ్రవరి లిస్ట్ లో ఉంది. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది.
నిజానికి ఫిబ్రవరి మొదటి నుండే బాక్సాఫీసు వద్ద సినిమాల సందడి మొదలు కానుంది. 3వ తేదీన యాక్టర్ సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ విడుదల కానుంది.
తెలుగు సినిమా
సమంతకు పోటీగా మూడు సినిమాలు
కలర్ ఫోటో తర్వాత సుహాస్ హీరోగా వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అంచానాలు ఉన్నాయి. అదేరోజు సందీప్ కిషన్ "మైఖేల్" సినిమాతో వస్తునాడు. ఈ టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
ఆ తర్వాత ఫిబ్రవరి 10వ తేదీన కళ్యాణ్ రామ్ "అమిగోస్" విడుదల అవుతుంది. బింబిసార తో హిట్ అందుకున్నాక కళ్యాణ్ రామ్ నెక్స్ట్ సినిమాపై ఆసక్తి పెరిగింది.
ఇక చివరగా ఫిబ్రవరి 17. ఈరోజు సమంత శాకుంతలంతో పాటు విశ్వక్ సేన్ "ధమ్కీ", కిరణ్ అబ్బవరం "వినరో భాగ్యము విష్ణుకథ", తమిళ హీరో ధనుష్ నటించిన "సార్" కూడా రిలీజ్ అవుతుంది.
మొత్తానికి ఫిబ్రవరి నెలలో బాక్సాఫీసు వద్ద సందడి ఎక్కువగా ఉండనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫిబ్రవరిలో తెలుగు తెర మీద చిన్న సినిమాల సందడి
February Month Films in Tollywood !!#WriterPadhmabushan#MICHAEL #Amigos #Dhamki #SiR #Shakunthalam #VinaroBhagyamuVishnuKatha pic.twitter.com/eZw6DCnsMH
— Tollywood Updates (@TollywoodTU) January 3, 2023