జీ2 ని రెడీ చేస్తున్న అడవి శేష్.. డేట్ ఫిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
అడవి శేష్.. క్షణం సినిమా నుండి మొన్న వచ్చిన హిట్ 2 వరకు అన్నింట్లోనూ విజయం అందుకున్నాడు. ఈ మధ్య తెలుగు సినిమాకి ఇన్ని హిట్లు అందించిన హీరో కనబడలేదు.
అందుకే శేష్ మీదకు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. తన సినిమా కథను తనే రాసుకోవడం శేష్ కి ఉన్న మరో స్పెషాలిటీ. క్షణం, ఎవరు, గూఢచారి సినిమాలకు తనే కథ అందించాడు.
ఐతే ప్రస్తుతం శేష్ నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది. చాలారోజులుగా ఊరిస్తున్న వార్త బయటకు వచ్చింది. గూఢచారి సీక్వెల్ ని ప్రకటించాడు శేష్. ఈ మేరకు ఒక పోస్టర్ ని వదిలాడు.
అందులో గన్ పట్టుకుని అటువైపు తిరిగి నిలబడ్డాడు శేష్.
అడవి శేష్
ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో
జీ2 రెడీ అవుతోందని, దేశవ్యాప్తంగా 2023 జనవరి 9వ తేదీన ప్రకటన ఉంటుందని పోస్టర్ లో చెప్పారు.
మేజర్ సినిమాతో ఇండియా మొత్తంలో మంచి పాపులారిటీ సాధించాడు శేష్. అందుకే గూఢచారి సీక్వెల్ ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.
ఈ సీక్వెల్ కి కూడా తనే కథ అందిస్తున్నాడు. వినయ్ కుమార్ సిరిగినీడి అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. పెద్ద బడ్జెట్ తో పెద్ద స్కేల్ లో సినిమా ఉంటుందని తెలుస్తోంది.
జనవరి 9వ తేదీన ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.