
మహేష్ తో సినిమాపై శ్రీలీల మౌనం... కారణం అదేనా?
ఈ వార్తాకథనం ఏంటి
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్ళిసందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల, వరుస సినిమాలకు సంతకాలు చేస్తూ బిజీగా ఉంది.
ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగానే సినిమాలున్నాయి. ఆమె నటించిన ధమాకా సినిమా ఈరోజే రిలీజైంది. ఐతే ప్రస్తుతం శ్రీలీల గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మహేష్ సరసన శ్రీలీల నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టాడు మహేష్. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలను తీసుకున్నట్లు వినిపిస్తోంది.
ఈ విషయమై అధికారిక సమాచారం బయటకి రాలేదు. శ్రీలీల కూడా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. సో, ఆమె మౌనాన్ని అంగీకారంగా భావిస్తున్నారు.
శ్రీలీల
వరుస సినిమాలతో బిజీ
మొదటి సినిమా పెళ్ళి సందడి పెద్దగా హిట్ అవ్వకపోయినా శ్రీలీలను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే రామ్- బోయపాటి కాంబోలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.
అలాగే నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తుంది. వైష్ణవ్ తేజ్ తర్వాతి సినిమాలో కూడా హీరోయిన్ గా ఉంది శ్రీలీల.
మరి ఈ జాబితాలో మహేష్- త్రివిక్రమ్ కాంబోలోని సినిమా చేరితే శ్రీలీలకు అదృష్టమనే చెప్పాలి. ప్రస్తుతం శ్రీలీల మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది.
మరి ఈ సినిమాలు ఆమెకు బ్లాక్ బస్టర్ లను అందించి తెలుగు తెర మీద పెద్ద హీరోయిన్ గా గుర్తింపును తీసుకొస్తాయో లేదో చూడాలి.