
2022 రివైండ్: తెలుగు తెరకు దిగొచ్చిన బాలీవుడ్ తారలు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ సంవత్సరం తెలుగు చిత్రపరిశ్రమకు కలిసి వచ్చిందనే చెప్పాలి. డైరెక్ట్ సినిమాల నుండి డబ్బింగ్ సినిమాల వరకు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధించాయి.
అలాగే కొత్త అందాలు తెలుగు తెరకు పరిచయం అయ్యాయి. ఈ లిస్టులో బాలీవుడ్ నుండి వచ్చిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు.
ఒకప్పుడు బాలీవుడ్ భామలు తెలుగు సినిమాల వైపు అసలు చూసేవారు కాదు. తెలుగులో నటించే హీరోయిన్లే బాలీవుడ్ వైపు వెళ్ళాలనుకునేవారు.
రాజమౌళి తీసిన బాహుబలి వల్ల కథంతా మారిపోయింది. తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఆర్ఆర్ఆర్ తో అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. అందుకే ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 2022లో తెలుగుకు దిగొచ్చిన బాలీవుడ్ తారలెవరో తెలుసుకుందాం.
బాలీవుడ్ హీరోయిన్స్
తెలుగు సినిమాకు బాలీవుడ్ అందాలు
ఆలియా భట్: రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో మెరిసింది. ఈ చిత్రంలో నటించడం కోసం తెలుగు నేర్చుకుంది.
మృణాల్ ఠాకూర్: సీతారామమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసిన సీత, ఈ మృణాల్ ఠాకూర్. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు.
అనన్య పాండే: విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లైగర్ సినిమా ఫ్లాప్ అయ్యింది కానీ హిట్ అయ్యుంటే హీరోయిన్ గా నటించిన అనన్య పాండేకి తెలుగు సినిమాలో మంచి స్థానం దక్కేది.
సాయి మంజ్రేకర్: అడవి శేష్ నటించిన మేజర్ సినిమాలో హీరోయిన్ గా మెరిసింది.