LOADING...
Mega 158 : కృతి కాదు.. అనశ్వర కాదు.. మెగా డాటర్‌గా ప్రీతి ముకుందన్ ఫిక్స్
కృతి కాదు.. అనశ్వర కాదు.. మెగా డాటర్‌గా ప్రీతి ముకుందన్ ఫిక్స్

Mega 158 : కృతి కాదు.. అనశ్వర కాదు.. మెగా డాటర్‌గా ప్రీతి ముకుందన్ ఫిక్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2026
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. కన్నడకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈచిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. చిరు-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మెగాస్టార్ కూతురి పాత్రకు ఎవరు ఎంపిక అవుతారన్న అంశంపై కొద్ది రోజులుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదట ఈ పాత్రకు 'ఉప్పెన' చిత్రంతో గుర్తింపు పొందిన కీర్తి శెట్టి పేరు బలంగా వినిపించింది. అనంతరం మలయాళ నటి అనస్వర రాజన్ ఎంపికయ్యారన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రోషన్ మేక హీరోగా వచ్చిన ఛాంపియన్‌తో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అనశ్వర, రెండో సినిమాకే మెగాస్టార్ చిత్రంలో అవకాశం దక్కించుకుందని ప్రచారం సాగింది.

Details

మరో క్రేజీ ప్రాజెక్టులో ప్రీతి  

అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కీలక పాత్రకు కృతి శెట్టి కాదు, అనశ్వర రాజన్ కూడా కాదు. చివరికి ఆ లక్కీ ఛాన్స్ ప్రీతి ముకుందన్ కు దక్కింది. ఈ చిత్రంలో ఆమె మెగాస్టార్ కూతురిగా ప్రధానమైన పాత్రలో కనిపించనుంది. పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, అంతిమంగా ప్రీతి ముకుందన్‌నే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మెగా ప్రాజెక్ట్ ఆమె కెరీర్‌కు గణనీయమైన మలుపు తీసుకురానుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా మెగాస్టార్ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లోనూ ప్రీతి భాగమైంది.

Advertisement