LOADING...
Kalyani: కళ్యాణి విడాకులపై క్లారిటీ.. తమ్ముడు చేతన్ చీను కీలక వ్యాఖ్యలు
కళ్యాణి విడాకులపై క్లారిటీ.. తమ్ముడు చేతన్ చీను కీలక వ్యాఖ్యలు

Kalyani: కళ్యాణి విడాకులపై క్లారిటీ.. తమ్ముడు చేతన్ చీను కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 24, 2026
12:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ నటి కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల కళ్యాణి సోదరుడు చేతన్ చీను ఒక ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా నటుడు సూర్య కిరణ్తో జరిగిన విడాకుల విషయంపై స్పందించారు. కళ్యాణి మాజీ భర్త సూర్య కిరణ్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఆయన బిగ్ బాస్ తెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో కళ్యాణి తిరిగి వస్తే కలిసి ఉండేందుకు తాను సిద్ధమని, ఆమెపై తనకు ఇప్పటికీ ఇష్టం ఉందని భావోద్వేగంగా మాట్లాడారు.

Details

ఇద్దరికి పరస్పరం గౌరవం ఉండాలి

అయితే వారి విడాకులకు దారితీసిన అసలు కారణాలు ఇప్పటికీ ప్రేక్షకులకు మాత్రమే కాదు, తమ కుటుంబ సభ్యులకు కూడా స్పష్టంగా తెలియదని చేతన్ తెలిపారు. ఇది తమ కుటుంబానికి బాధాకరమైన అంశమని, వ్యక్తిగత కారణాలపై తాను ఎక్కువగా మాట్లాడలేనని పేర్కొన్నారు. సూర్య కిరణ్‌తో తమ కుటుంబం నిరంతరం టచ్‌లోనే ఉండేదని, కళ్యాణికి సూర్య కిరణ్‌పై, సూర్య కిరణ్‌కు కళ్యాణిపై పరస్పర గౌరవం ఉన్నదని చెప్పారు. అయితే చిన్న చిన్న క్లాషెస్ కారణంగా పరిస్థితులు మారి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Details

సినిమాలకు దూరంగా కళ్యాణి

కళ్యాణి ఇప్పటివరకు విడాకుల గురించి బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఆర్థిక సమస్యలు లేదా ప్రాజెక్టుల నష్టాలు కూడా ఒక కారణమై ఉండవచ్చని తాను భావిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం కళ్యాణి సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు కథానాయికగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ రాణించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా సైలెంట్‌గా ఉన్నారు.

Advertisement