LOADING...
Arvind Swamy: స్టార్‌డమ్ మధ్యలోనే పక్షవాతం…ఆయుర్వేదంతో కోలుకున్న స్టార్ హీరో!
స్టార్‌డమ్ మధ్యలోనే పక్షవాతం…ఆయుర్వేదంతో కోలుకున్న స్టార్ హీరో!

Arvind Swamy: స్టార్‌డమ్ మధ్యలోనే పక్షవాతం…ఆయుర్వేదంతో కోలుకున్న స్టార్ హీరో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 24, 2026
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

90వ దశకంలో లవర్ బాయ్ ఇమేజ్‌తో ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోల్లో అరవింద్ స్వామి ఒకరు. ముఖ్యంగా రోజా, బాంబే సినిమాల ద్వారా ఆయనకు విపరీతమైన ప్రజాదరణ లభించింది. ఈ రెండు చిత్రాల విజయంతో తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరో స్థాయికి ఎదిగిన ఆయన, దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. కెరీర్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న సమయంలో అరవింద్ స్వామికి జరిగిన ఒక చిన్న గాయం అనుకోని మలుపు తీసుకొచ్చింది. ఆగాయంతో ఆయనకు పాక్షిక పక్షవాతం రావడంతో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ పరిస్థితి తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, ఆరోగ్యం కుదుటపడిన అనంతరం మళ్లీ నటనలోకి రీ ఎంట్రీ ఇచ్చి కెరీర్‌ను కొత్త ఉత్సాహంతో కొనసాగిస్తున్నారు.

Details

18 నెలల పాటు బాధపడ్డాను

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అరవింద్ స్వామి, పక్షవాతం వచ్చిన తర్వాత ఎదుర్కొన్న కష్టాలను వివరించారు. "నాకు పాక్షికంగా పక్షవాతం వచ్చింది. దాంతో నేను తీవ్రంగా మానసికంగా, శారీరకంగా బాధపడ్డాను. దాదాపు 18 నెలల పాటు ఆ బాధ నన్ను వెంటాడింది. ఆ తర్వాత నేను ఆయుర్వేద వైద్యం తీసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఆయుర్వేద చికిత్స తనకు ఎంతో మేలు చేసిందని ఆయన పేర్కొన్నారు. "ఆ వైద్యం నా శరీరంపై అద్భుతంగా పనిచేసింది. ఎంతో ప్రాచీనమైన ఆయుర్వేద విధానం నా కోలుకోవడంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఇది అందరికీ సరిపోతుందని నేను చెప్పను.

Details

ధ్రువతో టాలీవుడ్ లోకి ఎంట్రీ

కానీ నా విషయంలో మాత్రం అద్భుత ఫలితాలు ఇచ్చిందని స్పష్టం చేశారు. రీ ఎంట్రీలో భాగంగా తమిళంలో రూపొందిన థాని ఒరువన్ ఆయనకు మరోసారి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇదే సినిమాను టాలీవుడ్ లో ధ్రువ పేరుతో రీమేక్ చేశారు. ఇందులో హీరోగా రామ్ చరణ్ నటించగా, అరవింద్ స్వామి విలన్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రం కూడా ఘన విజయాన్ని సాధించడంతో, తెలుగులోనూ ఆయనకు రీ ఎంట్రీలో మంచి ఆదరణ లభించింది. మొత్తంగా ఆరోగ్య సమస్యలతో వచ్చిన విరామం తర్వాత కూడా మళ్లీ బలంగా నిలబడి కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న అరవింద్ స్వామి ప్రయాణం పలువురికి స్ఫూర్తిదాయకంగా మారింది.

Advertisement