Vishwak Sen: అమ్మ మాటనే పాటించా : హీరో విశ్వక్ సేన్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో విశ్వక్‌సేన్, ఫలక్‌నుమాదాస్, హిట్ వంటి చిత్రాలతో తన క్రేజ్‌ను పెంచుకున్నాడు. వరుస విజయాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ యువ హీరో తాజాగా 'ఫంకీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో జాతి రత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవానికి, ఈ సినిమా విశ్వక్ కెరీర్‌కు చాలా కీలకమైనదిగా చెప్పొచ్చు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో, విశ్వక్‌సేన్ తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Details
అందుకే హీరోగా మారాను
విశ్వక్ మాట్లాడుతూ మా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను హీరోలా చూడమని చెప్పేది. ఆమె చెప్పిన మాటను నేను చాలా సీరియస్‌గా తీసుకున్నాను, అందుకే హీరోగా మారానని చెప్పారు. 'ఫంకీ' సినిమా ఫిబ్రవరి 13న థియేటర్స్‌లో విడుదల కానుంది. విశ్వక్ ఈ సినిమాపై చాలా ఆశలతో ఉన్నారు. కయాదులోహర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ కొన్ని సీన్లలో డైరెక్టర్‌గా కూడా కనిపించబోతున్నాడని సమాచారం. లైలా చిత్రాన్ని మార్కెట్‌లో ప్రభావితం చేయకలేకపోయిన తరువాత, విశ్వక్ ఈ ఫంకీ మూవీతో హిట్ కొట్టాలని తహతహలాడుతున్నారు.