LOADING...
The Paradise: 'ది ప్యారడైజ్‌' రిలీజ్ వాయిదా.. కొత్త తేదీని ప్రకటించిన మేకర్స్
'ది ప్యారడైజ్‌' రిలీజ్ వాయిదా.. కొత్త తేదీని ప్రకటించిన మేకర్స్

The Paradise: 'ది ప్యారడైజ్‌' రిలీజ్ వాయిదా.. కొత్త తేదీని ప్రకటించిన మేకర్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2026
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

కథానాయకుడు నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్‌' సినిమా విడుదల వాయిదా పడింది. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఆగస్టు 21న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించారు. 'దసరా' విజయానంతరం నాని - దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం ఇదే. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. కథానాయికగా కయాదు లోహర్ నటిస్తుండగా, సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.

Details

ఎనిమిది భాషల్లో రిలీజ్

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో నాని 'జడల్‌' అనే రా, రస్టిక్ పాత్రలో మునుపెన్నడూ కనిపించని కొత్త లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఈ చిత్రాన్ని ఎనిమిది భాషల్లో పాన్-వరల్డ్ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. సంగీతాన్ని అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తుండగా, ఛాయాగ్రహణం సీహెచ్ సాయి నిర్వహిస్తున్నారు.

Advertisement