LOADING...
Chandrahas: ఆడియో ఈవెంట్ వివాదం.. నటుడు చంద్రహాస్‌పై మరో కేసు నమోదు
ఆడియో ఈవెంట్ వివాదం.. నటుడు చంద్రహాస్‌పై మరో కేసు నమోదు

Chandrahas: ఆడియో ఈవెంట్ వివాదం.. నటుడు చంద్రహాస్‌పై మరో కేసు నమోదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 06, 2026
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

యువ నటుడు చంద్రహాస్‌ (నటుడు ప్రభాకర్‌ కుమారుడు)పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ కానిస్టేబుల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. చంద్రహాస్‌ నటించిన 'బరాబర్‌' సినిమా ఆడియో వేడుక ఇటీవల నిర్వహించగా, ఆ కార్యక్రమంలో ఆయన అభ్యంతరకర పదజాలంతో కూడిన ఓ పాటను ఆలపించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పాట పట్ల పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇది ప్రజా మర్యాదను దెబ్బతీసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఈవెంట్‌లో చంద్రహాస్‌ ప్రవర్తనతో పాటు ఆయన వాడిన పదాలు అసభ్యకరంగా ఉన్నాయని కానిస్టేబుల్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఆధారాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Details

కేసు నమోదు వివరాలు

జూబ్లీహిల్స్‌ పోలీసులు చంద్రహాస్‌పై BNS సెక్షన్‌ 296తో పాటు ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై ఇప్పటికే మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లోనూ చంద్రహాస్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో నమోదైన కేసు విషయంలో చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement