NTR: జపాన్‌లో ఎన్టీఆర్ మేనియా.. హైదరాబాద్‌లో మాల్‌కు ఫ్యాన్స్ రాక!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటిన విషయం తెలిసిందే. బహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి చిత్రాలు విదేశాల్లోనూ భారీ కలెక్షన్లు సాధించాయి. టాలీవుడ్ హీరోలు ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌లకు ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన అభిమానగణం ఉంది. ముఖ్యంగా జపాన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ విశేషం. సినిమాలకే పరిమితం కాకుండా, ఎన్టీఆర్ నటించిన ప్రకటనలు కూడా విదేశీయులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఒక జపనీస్ అభిమాని ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ హైదరాబాద్‌లోని సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్‌ను సందర్శించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.
Details
ఎన్టీఆర్ యాడ్ చూసి వచ్చాను
ఆ సంస్థ కోసం ఆయన చేసిన ప్రకటనలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ అడ్వర్టైజ్‌మెంట్ చూసి ప్రేరణ పొందిన జపనీస్ కస్టమర్ ప్రత్యేకంగా షాపింగ్ కోసం ఈ మాల్‌ను సందర్శించాడు. తనకు నచ్చిన దుస్తులను కొనుగోలు చేశాడు. ఎన్టీఆర్ యాడ్ చూసి ఇక్కడికి వచ్చాను. ఇది నా జీవితంలో ఒక మంచి అనుభవం అని ఆయన పేర్కొన్నాడు. ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రాండ్ అంటే నమ్మకానికి చిహ్నమని అభిప్రాయపడ్డాడు. ఈ సంఘటన 'గ్లోబల్ ఫ్యాన్స్ - గ్లోబల్ లవ్'కు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. తెలుగు హీరోల ప్రభావం ఎంతగా విస్తరించిందో చెప్పడానికి ఇది చిన్న నిదర్శనం మాత్రమే.