LOADING...
Kohli New Record: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ.. సచిన్ రికార్డుకు బద్దలయ్యే అవకాశం! 
చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ.. సచిన్ రికార్డుకు బద్దలయ్యే అవకాశం!

Kohli New Record: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ.. సచిన్ రికార్డుకు బద్దలయ్యే అవకాశం! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2025
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓ చారిత్రక ఘట్టం మరికొద్ది రోజుల్లోనే ఆవిష్కృతం కానుంది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ ప్రతిష్ఠాత్మక ప్రపంచ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టడానికి కేవలం 25 పరుగుల దూరంలోనే నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లోనే ఈ ఘనత సాధించే అవకాశాలు కోహ్లీకి పుష్కలంగా ఉన్నాయి. టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత ప్రస్తుతం వన్డే క్రికెట్‌కే పరిమితమైన కోహ్లీ, జనవరి 11న జరిగే తొలి వన్డేతో మళ్లీ అంతర్జాతీయ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.

Details

28 వేల పరుగుల మైలురాయికి అతి సమీపంలో కోహ్లీ 

అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి విరాట్ కోహ్లీకి ఇంకా 25 పరుగులే అవసరం. ఈ ఘనత సాధిస్తే, ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో 28 వేల పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ పేరు నిలిచిపోతుంది. సచిన్ టెండూల్కర్ 644 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకోగా, శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర తన కెరీర్ చివరి ఇన్నింగ్స్‌లోనే 28 వేల పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం కోహ్లీ 623 ఇన్నింగ్స్‌ల్లో 27,975 పరుగులు చేశాడు. మరో 25 పరుగులు చేస్తే, సచిన్ తర్వాత అతి వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించనున్నాడు.

Details

 28 వేల పరుగుల జాబితాలో ఉన్న దిగ్గజాలు

సచిన్ టెండూల్కర్ - 782 ఇన్నింగ్స్‌ల్లో 34,357 పరుగులు కుమార్ సంగక్కర - 666 ఇన్నింగ్స్‌ల్లో 28,016 పరుగులు విరాట్ కోహ్లీ - ప్రస్తుతం 623 ఇన్నింగ్స్‌ల్లో 27,975 పరుగులు విరాట్ కోహ్లీ కెరీర్ గణాంకాలు వన్డేలు మ్యాచ్‌లు: 308 పరుగులు: 14,557 శతకాలు: 53 అర్ధశతకాలు: 76 వన్డేల్లో అత్యంత వేగంగా 10,000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు టెస్టులు మ్యాచ్‌లు: 123 పరుగులు: 9,230 టెస్ట్ కెరీర్ ప్రారంభం: 2011 టెస్ట్ రిటైర్మెంట్: మే 2025 68 టెస్టుల్లో 40 విజయాలతో భారత టెస్ట్ జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్

Advertisement

Details

టీ20 ఇంటర్నేషనల్స్

మ్యాచ్‌లు: 125 పరుగులు: 4,188 శతకాలు: 1 అర్ధశతకాలు: 38 2024 టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత ఫార్మాట్‌కు గుడ్‌బై ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. అభిమానుల ఉత్కంఠ సచిన్ టెండూల్కర్ తర్వాత భారత క్రికెట్‌లో మరో స్వర్ణాధ్యాయం విరాట్ కోహ్లీ రాయబోతున్నాడన్న భావనతో అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. న్యూజిలాండ్ సిరీస్‌లో కోహ్లీ బ్యాట్ నుంచి వచ్చే ఒక్క ఇన్నింగ్స్‌ చాలు... క్రికెట్ చరిత్రలో మరో చిరస్మరణీయ ఘట్టం నమోదయ్యేందుకు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Advertisement