Shahid Afridi : 2027 వరల్డ్ కప్ వరకు కోహ్లీ-రోహిత్ భారత్‌కు వెన్నెముక.. గంభీర్‌పై ఆఫ్రిది ఫైర్!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి భారత క్రికెట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఘాటుగా విమర్శలు గుప్పించి, సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు మద్దతు ప్రకటించారు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఈ ఇద్దరు ఆటగాళ్లు జట్టుకు వెన్నెముకలా ఉంటారని అఫ్రిది స్పష్టంచేశారు. అఫ్రిది ప్రకారం, కోహ్లీ, రోహిత్ భారత జట్టుకు మాత్రమే కాకుండా, ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన వన్డే బ్యాట్స్‌మెన్‌లు. ఇటీవల సౌతాఫ్రికా సిరీస్‌లో వీరి అద్భుతమైన ప్రదర్శన దృష్ట్యా, వీరు 2027 వన్డే వరల్డ్ కప్ వరకు భారత జట్టుకు బ్యాక్‌బోన్‌గా కొనసాగుతారని ఆయన పేర్కొన్నారు.
Details
గతంలో గంభీర్, అఫ్రిది మధ్య అనేక వివాదాలు
విరాట్, రోహిత్ భారత బ్యాటింగ్ లైన్‌అప్‌కు నిజమైన వెన్నెముక. వారి తాజా ప్రదర్శనను బట్టి, 2027 వరల్డ్ కప్ వరకు సులభంగా ఆడగలుగుతారని స్పష్టమవుతోందని అన్నారు. కోహ్లీ, రోహిత్‌లను కీలక టోర్నమెంట్‌లు, సిరీస్‌లలో తప్పక ఆడించాలని సలహా ఇచ్చారు. అయితే భారత జట్టు బలహీన ప్రత్యర్థులతో ఆడేటప్పుడు యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు వారిద్దరికీ విశ్రాంతి ఇవ్వవచ్చని సూచించారు. దీంతో ప్రధాన ఆటగాళ్లు పెద్ద టోర్నీలలో పూర్తిగా శక్తివంతంగా ఉండగలుగుతారని అఫ్రిది అభిప్రాయపడ్డారు. అనంతరం అఫ్రిది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై చేసిన విమర్శలు చేశారు. మైదానంలో గతంలో వీరిద్దరి మధ్య అనేక వివాదాలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. అఫ్రిది మాట్లాడుతూ గౌతమ్ కోచ్‌గా ప్రారంభించినప్పుడు, తన అభిప్రాయం మాత్రమే సరైనదని భావించినట్లయింది.
Details
నా రికార్డును అధిగమించినందుకు సంతోషంగా ఉంది
కానీ కొంతకాలం తర్వాత, ఎప్పుడూ సరైనవారు కాలేరని నిరూపితమైందమని గంభీర్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. గంభీర్ ఇప్పటికే 2027 వరల్డ్ కప్ చాలా దూరంలో ఉందని, యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి జట్టుకు కొత్త దిశానిర్దేశం చేయాలని చూస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అఫ్రిది, వన్డేలలో అత్యధిక సిక్సర్ల రికార్డు భారత కెప్టెన్ రోహిత్ శర్మ అధిగమించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సౌతాఫ్రికా పై రాయ్‌పూర్ వన్డేలో రోహిత్ తన కెరీర్‌లో 355వ సిక్సర్ కొట్టి, అఫ్రిది (351 సిక్సర్లు) రికార్డును అధిగమించాడు. పాత రోజులను గుర్తు చేసుకుంటూ, 2008 ఐపీఎల్‌లో తాను డెక్కన్ ఛార్జర్స్‌లో ఆడుతున్నప్పుడే రోహిత్ ఒక రోజు భారతదేశంలో పెద్ద ప్లేయర్ అవుతాడని గుర్తించానని అఫ్రిది ప్రశంసించారు.