Virat Kohli: విరాట్ కోహ్లీ 50 వన్డే సెంచరీ చేసిందే ఈ రోజే.. బీసీసీఐ ప్రత్యేక పోస్టు!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. 2023 నవంబర్ 15న వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌పై జరిగిన వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్‌లో ఆయన తన కెరీర్‌లో 50వ శతకాన్ని నమోదు చేశారు . ఈ సెంచరీతో కోహ్లీ, వన్డేల్లో అత్యధిక శతకాల (49) రికార్డు కలిగిన సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు. టెండూల్కర్ ఈ మైలురాయిని 451 వన్డే ఇన్నింగ్స్‌ల్లో చేరుకోగా, కోహ్లీ కేవలం 277 ఇన్నింగ్స్‌లలోనే 50 సెంచరీల మార్క్‌ను తాకాడు. వరల్డ్‌కప్ 2023లోనే 49వ సెంచరీ కొట్టిన కోహ్లీ, కేవలం ఒక్క ఇన్నింగ్స్ గ్యాప్ తర్వాత 279వ ఇన్నింగ్స్‌లోనే 50వ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.
Details
చారిత్రాత్మక రోజు గుర్తు చేసిన బీసీసీఐ
ఈ మ్యాచ్‌ను స్వయంగా మైదానంలో కూర్చొని వీక్షించిన సచిన్ టెండూల్కర్, కోహ్లీ రికార్డు బద్దలవుతున్న క్షణాన్ని ప్రత్యక్షంగా చూసి అతన్ని ప్రత్యేకంగా అభినందించాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ వన్డేల్లో 51 సెంచరీలు సాధించాడు (293 ఇన్నింగ్స్‌లు). ఈ చారిత్రాత్మక రోజును గుర్తుచేసుకుంటూ బీసీసీఐ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్ షేర్ చేయగా, అది అభిమానుల నుండి విశేష స్పందనను అందుకుంది. టీ20, టెస్ట్ ఫార్మాట్లకు ఇప్పటికే వీడ్కోలు పలికిన కోహ్లీ, ప్రస్తుతం పూర్తిగా వన్డేలపై దృష్టి పెట్టాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పునరాగమనం చేసిన ఆయన, మొదటి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్లు అయినప్పటికీ, మూడో వన్డేలో 74* (81 బంతుల్లో) హాఫ్ సెంచరీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.