Vijay Hazare Trophy: దేశవాళీ వన్డేల్లోనూ క్రేజ్ తగ్గలేదు.. కోహ్లీ, రోహిత్ వచ్చే శాలరీ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీనియర్ క్రికెటర్లు ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఒక్కో మ్యాచ్‌కు ఎంత పారితోషికం పొందుతున్నారన్న వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఐపీఎల్‌తో పోలిస్తే విజయ్ హజారే ట్రోఫీలో భారీ మొత్తాలు ఉండవు. అయినప్పటికీ, అనుభవం ఉన్న సీనియర్ ఆటగాళ్లకు మాత్రం మంచి శాలరీ లభిస్తుంది. వాస్తవానికి ఐపీఎల్‌లో ఆటగాళ్లను వేలం ద్వారా కొనుగోలు చేస్తారు. కానీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడే క్రికెటర్లకు ఫిక్స్‌డ్ శాలరీ విధానం అమలులో ఉంటుంది. లిస్ట్-ఏ (దేశవాళీ వన్డే) మ్యాచ్‌ల అనుభవాన్ని ఆధారంగా తీసుకుని ఆటగాళ్లను వేర్వేరు కేటగిరీల్లో విభజించి పారితోషికం నిర్ణయిస్తారు.
Details
సీనియర్ ఆటగాళ్లకే ఎక్కువ మొత్తం
ఈ లెక్కన చూస్తే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ ఆటగాళ్లకు ఈ టోర్నీలో ఎక్కువ మొత్తమే అందుతుంది. ఈ టోర్నీ కోసం బీసీసీఐ మూడు కేటగిరీల్లో శాలరీని నిర్ణయించింది. సీనియర్ కేటగిరీలో 40కు పైగా లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు ఉంటారు. ఈ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.60,000 ఫీజు ఇస్తారు. ఒకవేళ అదే కేటగిరీలో ఉన్న ప్లేయర్ రిజర్వ్‌గా ఉంటే, అతడికి రూ.30,000 చెల్లిస్తారు. మిడ్-లెవల్ కేటగిరీలో 21 నుంచి 40 వరకు లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు ఉంటారు. వీరికి ఒక్కో మ్యాచ్‌కు రూ.50,000ఇస్తారు. రిజర్వ్‌లో ఉంటే రూ.25,000 మాత్రమే చెల్లిస్తారు. జూనియర్ కేటగిరీలో 20 లిస్ట్-ఏ మ్యాచ్‌ల వరకు ఆడిన ప్లేయర్లు ఉంటారు.
Details
ఒక్కో మ్యాచ్ కు రూ.40వేలు ఫీజు
వీరికి ఒక్కో మ్యాచ్‌కు రూ.40,000 ఫీజు ఉంటుంది. అదే జూనియర్ కేటగిరీలో రిజర్వ్ ప్లేయర్లకు రూ.20,000 శాలరీ ఇస్తారు. ప్రస్తుత సీజన్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ సీనియర్ కేటగిరీలోకి వస్తారు. ఎందుకంటే వారు ఇప్పటికే 40కు మించిన లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడారు. అందువల్ల వీరిద్దరికీ విజయ్ హజారే ట్రోఫీలో ఒక్కో మ్యాచ్‌కు రూ.60,000 చొప్పున పారితోషికం లభిస్తుంది. అయితే అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల విషయానికి వస్తే, బీసీసీఐ ఒక్కో ఆటగాడికి మ్యాచ్‌కు రూ.6 లక్షలు చెల్లిస్తుంది. ఇక విజయ్ హజారే ట్రోఫీలో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు గెలిచిన క్రికెటర్‌కు అదనంగా రూ.10,000 నగదు బహుమతి ఇస్తారు.