Team India : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ ఓటమి అనంతరం భారత జట్టు సౌతాఫ్రికాపై ఘన విజయంతో పుంజుకుంది. విశాఖపట్నంలో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఆధిపత్య విజయం సాధించి, సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ గెలుపులో సీనియర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరొకసారి అద్భుత ప్రదర్శన కనబర్చి తమ అనుభవ విలువను నిరూపించారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లపై భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రెండు నెలలుగా కోహ్లీ, రోహిత్ వన్డే భవిష్యత్తు చుట్టూ క్రికెట్ వర్గాల్లో చర్చలు జోరుగా నడిచాయి.
Details
వారిని జట్టు నుంచి తప్పించడం కష్టమే
2027 వన్డే వరల్డ్ కప్ దృష్టిలో ఉంచుకొని టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక్టర్లు ఈ ఇద్దరిని తప్పించే అవకాశమ ఉందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వరుసగా రెండు వన్డే సిరీస్‌ల్లోనే ఈ ఇద్దరు దిగ్గజాలు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లుగా నిలిచి, ఆ ఊహాగానాలన్నింటిని ఖండించారు. రోహిత్, కోహ్లీ వరుస సిరీస్‌ల్లో కనబరిచిన స్థిరమైన ప్రదర్శన, జట్టులో వారి ప్రాముఖ్యతను మరోసారి స్పష్టంగా రుజువు చేసింది. ఫలితంగా వారిని జట్టు ప్లాన్‌ల నుంచి తప్పించటం ప్రస్తుతం అసంభవంగా మారిపోయింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన గౌతమ్ గంభీర్ కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా సూచించారు. వారిద్దరూ భారత్ తరఫున చాలా కాలంగా ఇలాగే ఆడుతున్నారు.
Details
మెరుగైన ప్రదర్శన చేస్తారు
రాబోయే రోజుల్లో వైట్-బాల్ క్రికెట్‌లో మరింత మెరుగైన ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు తొమ్మిదినెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న విరాట్, రోహిత్‌లు ఆస్ట్రేలియా సిరీస్‌తో మళ్లీ జట్టులోకి వచ్చారు. ఆ సిరీస్‌లో రోహిత్ శర్మ 203 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకోగా, కోహ్లీ చివరి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ 302 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. రోహిత్ కూడా రెండు అర్ధ సెంచరీలు నమోదు చేసి జట్టు విజయానికి కీలకంగా దోహదం చేశాడు.