LOADING...
Virat Kohli: లిస్ట్-ఏ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర.. సచిన్ రికార్డు బద్దలు
లిస్ట్-ఏ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర.. సచిన్ రికార్డు బద్దలు

Virat Kohli: లిస్ట్-ఏ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర.. సచిన్ రికార్డు బద్దలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్‌కు చెందిన స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరుతో ఉన్న కీలక రికార్డును అధిగమిస్తూ,లిస్ట్-ఏ వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 16వేల పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కేవలం 330 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకుని క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీలో పాల్గొంటున్న కోహ్లీ, ఆంధ్రప్రదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తోనే లిస్ట్-ఏ క్రికెట్‌లో 16 వేల పరుగుల గడపను దాటి కొత్త రికార్డును నెలకొల్పాడు. గతంలో ఈ ఘనతను సచిన్ టెండూల్కర్ 391ఇన్నింగ్స్‌ల్లో సాధించగా,కోహ్లీ చాలా తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డును చెరిపేశాడు.

వివరాలు 

వన్డే సిరీస్‌పై కోహ్లీ ఆశలు

బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కోహ్లీ వేగంగా పరుగులు రాబట్టి జట్టుకు కీలక సహకారం అందించాడు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ మళ్లీ బరిలోకి దిగడం విశేషంగా మారింది. ఈ టోర్నీలో ఇప్పటికే అతడి పేరుతో మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 13మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ,68 సగటుతో 819 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలు,మూడు అర్ధశతకాలు ఉండడం విశేషం. ఇప్పటికే టెస్టు,టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ,వన్డే క్రికెట్‌పై మాత్రం పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌పై కోహ్లీ ఆశలు పెట్టుకున్నాడని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స‌చిన్ టెండూల్క‌ర్ క‌న్నా వేగంగా ఆ మైలురాయి దాటేసిన విరాట్ కోహ్లీ

Advertisement