BCCI Demotes Kohli- Rohit: టీ20 వరల్డ్‌కప్‌కు ముందు సంచలన నిర్ణయం.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ షాక్
ఈ వార్తాకథనం ఏంటి
ఈరోజు ప్రారంభమవుతున్న టీ20 వరల్డ్‌కప్‌కు ముందే టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ నుంచి ఊహించని షాక్ తగిలింది. భారత క్రికెట్‌లో ఒక యుగానికి ముగింపు పలికేలా, 2025-26 సీజన్‌కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్‌లో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. తాజా నిర్ణయాల ప్రకారం ఇప్పటివరకు అగ్రశ్రేణి ఆటగాళ్లకే కేటాయిస్తూ వచ్చిన A+ కేటగిరీని పూర్తిగా రద్దు చేసింది. ఇకపై కాంట్రాక్ట్ వ్యవస్థను కేవలం గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C అనే మూడు విభాగాలకే పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది.
Details
కోహ్లీ, రోహిత్‌కు గ్రూప్ B
భారత క్రికెట్ దిగ్గజాలైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను బీసీసీఐ గ్రూప్ Bకి డిమోట్ చేసింది. అయితే ఈ నిర్ణయానికి స్పష్టమైన కారణం ఉందని బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి. కోహ్లీ, రోహిత్ ఇప్పటికే టీ20లు, టెస్టు ఫార్మాట్‌ల నుంచి విరమించుకున్నారు. ప్రస్తుతం వారు వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. అన్ని ఫార్మాట్లలో నిరంతరం అందుబాటులో ఉండే ఆటగాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.
Details
కొత్త అత్యున్నత కేటగిరీ - గ్రూప్ A
ఇకపై అత్యున్నత స్థాయి కాంట్రాక్ట్‌గా గ్రూప్ A కొనసాగనుంది. అన్ని ఫార్మాట్లలో కీలకంగా ఆడుతున్న లేదా జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఆటగాళ్లకే ఈ గ్రూప్‌లో స్థానం లభించనుంది. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో కేవలం ముగ్గురు మాత్రమే చోటు దక్కించుకున్నారు. గ్రూప్‌ల వారీగా ఆటగాళ్ల జాబితా గ్రూప్ A శుభ్‌మన్ గిల్ (టెస్టు, వన్డే కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా. గ్రూప్ B రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ సిరాజ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్.
Details
గ్రూప్ C
అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకు సింగ్, శివమ్ దూబే, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్. ఈ మార్పులతో బీసీసీఐ ఒక విషయం స్పష్టంగా చెప్పింది. పేరు కాదు-ప్రదర్శనే ముఖ్యం. గత ఘనతల కంటే ప్రస్తుత కంట్రిబ్యూషన్, వర్క్‌లోడ్, అన్ని ఫార్మాట్లలో లభ్యత ఆధారంగానే గౌరవం ఇస్తామని స్పష్టం చేసింది. రూ.7 కోట్ల విలువైన A+కేటగిరీని తొలగించడం ద్వారా ఆటగాళ్ల భారం, ఫిట్‌నెస్, లభ్యతపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సెంట్రల్ కాంట్రాక్ట్ విధానం భారత క్రికెట్‌లో పరివర్తన దశను స్పష్టంగా సూచిస్తోంది.