Donald Trump: ట్రంప్‌కు 321 వజ్రాలతో ప్రత్యేక ఉంగరం బహుమతి
వ్రాసిన వారు
Moogati Shabari
Jul 04, 2026
09:20 am
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా స్వాతంత్య్రానికి 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బెల్జియంలోని వజ్రాల పరిశ్రమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విశిష్టమైన బహుమతిని అందించింది. మొత్తం 321 వజ్రాలు, 56 రత్నాలు, పచ్చలతో అలంకరించిన బంగారు ఉంగరాన్ని ఆయనకు బహుకరించింది.
వివరాలు
వారికి కృతజ్ఞతలు తెలిపిన ట్రంప్..
ఈ ఉంగరాన్ని ట్రంప్ పేరును సూచించే ఆంగ్ల అక్షరం 'T', అలాగే అమెరికా జాతీయ పతాకంలోని నక్షత్రాలు, చారలు స్పష్టంగా ప్రతిబింబించేలా ప్రత్యేకంగా రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా వజ్రాల పరిశ్రమకు పేరొందిన బెల్జియంలోని యాంట్వెర్ప్ నగరంలో ఈ ఉంగరాన్ని తయారు చేశారు. ఈ అరుదైన బహుమతిపై స్పందించిన ట్రంప్, ''అమూల్యమైన ఈ ఉంగరాన్ని బహూకరించిన నా యాంట్వెర్ప్ మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు'' అని తెలిపారు.