TG Police: తెలంగాణ పోలీసు శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 5,000 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ నుంచి అవసరమైన అనుమతులు లభించడంతో నియామక ప్రక్రియ ప్రారంభానికి మార్గం సుగమమైంది.
వివరాలు
త్వరలోనే పూర్తి స్థాయి నోటిఫికేషన్..
త్వరలోనే ఈ నియామకాలకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. అందులో పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, పరీక్షల షెడ్యూల్ తదితర వివరాలను వెల్లడించనున్నారు. మొత్తం 10 విభాగాలకు చెందిన 5,000 పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భర్తీ చేయనున్నారు. వాటిలో అత్యధికంగా పోలీసు కానిస్టేబుల్ (సివిల్) విభాగంలో 3,697 పోస్టులు ఉన్నాయి. అలాగే ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుల్ విభాగంలో 1,052 పోస్టులను భర్తీ చేయనున్నారు.
వివరాలు
పోస్టుల వివరాలు ఇవే..
సబ్‌ఇన్‌స్పెక్టర్ (సివిల్) - 148 పోస్టులు సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఆర్మ్‌డ్ రిజర్వ్) - 14 పోస్టులు రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (టీజీఎస్పీ) - 12 పోస్టులు సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఏఆర్ సీపీఎల్) - 3 పోస్టులు అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎఫ్‌పీబీ) - 23 పోస్టులు పోలీసు కానిస్టేబుల్ (ఎస్‌ఏఆర్ సీపీఎల్) - 24 పోస్టులు పోలీసు కానిస్టేబుల్ (డ్రైవర్-పీటీవో) - 20 పోస్టులు మెకానిక్ పీటీవో - 7 పోస్టులు ఈ నియామకాల ద్వారా రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, వేలాది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.