LOADING...
Virat - Rohit: ఆ ఒక్క కండీషన్‌కు ఓకే అంటే.. విరాట్ - రోహిత్‌కు ఛాన్స్‌.. 
ఆ ఒక్క కండీషన్‌కు ఓకే అంటే.. విరాట్ - రోహిత్‌కు ఛాన్స్‌..

Virat - Rohit: ఆ ఒక్క కండీషన్‌కు ఓకే అంటే.. విరాట్ - రోహిత్‌కు ఛాన్స్‌.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2025
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే ప్రపంచ కప్‌కి ఇంకా రెండేళ్లు ఉన్నా, భారత క్రికెట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంపికపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. కారణం.. ఈ ఇద్దరూ టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికి, ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లోనే ఆడుతున్నారు. అయితే, బీసీసీఐ వేసే షరతులను అంగీకరించకపోతే, వన్డే క్రికెట్‌కీ రిటైర్ అయ్యే అవకాశం ఉందన్నది క్రికెట్ వర్గాల అభిప్రాయం.

వివరాలు 

ఈ ఏడాది డిసెంబరు నుంచి "విజయ్ హజారే ట్రోఫీ"

2027 వన్డే ప్రపంచ కప్‌కి రోహిత్,కోహ్లీ ఆడాలంటే వారు అప్పటివరకు ఫిట్‌గా, మంచి ఫామ్‌లో కొనసాగడం తప్పనిసరి. ఈ క్రమంలో, వారిని ఆ జట్టులో పరిగణించాలంటే బీసీసీఐ ప్రత్యేక నిబంధన పెట్టినట్లు సమాచారం. దేశవాళీ వన్డే టోర్నమెంట్ "విజయ్ హజారే ట్రోఫీ" ఈ ఏడాది డిసెంబరు నుంచి జరగనుంది. ఆ మ్యాచ్‌ల్లో రోహిత్, కోహ్లీ ఆడితేనే వచ్చే వరల్డ్‌కప్ జట్టులో వారికి చోటు ఉండే అవకాశం ఉంది. లేకుంటే, ఆ అవకాశాలు దాదాపు మూసుకుపోతాయని భావిస్తున్నారు. కొత్త జట్టును నిర్మించేందుకు కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తి చూపే అవకాశం ఎక్కువ. ఇదే పరిస్థితి టెస్టుల్లో కూడా జరిగింది.

వివరాలు 

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కీలక పరీక్ష 

కొత్త డబ్ల్యుటీసీ సీజన్‌లో శుభమన్ గిల్‌కు కెప్టెన్సీ ఇవ్వడానికి ప్రధాన కారణం ఇదే. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడాలనుకున్న రోహిత్, కోహ్లీకి బీసీసీఐ భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా అవకాశం ఇవ్వడం కష్టమని తెలియజేయడంతో, టెస్టుల నుంచి వీడ్కోలు పలికారని చెప్పుకోవచ్చు. రోహిత్, కోహ్లీ వన్డే కెరీర్ భవిష్యత్తు,మరో రెండు నెలల్లో జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్‌లో తేలే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో టీమిండియా ఆసీస్‌తో వన్డేలు ఆడనుంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ లండన్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్‌గా మారాయి.

వివరాలు 

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కీలక పరీక్ష 

రోహిత్ శర్మ ప్రాక్టీస్‌పై మాత్రం స్పష్టమైన సమాచారం లేదు. ఇటీవల ఇంగ్లాండ్-భారత్ మధ్య ఓవల్‌లో జరిగిన టెస్టు సమయంలో రోహిత్ అక్కడ కనిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మే. అతడి సారథ్యంలోనే ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి రోహిత్, కోహ్లీ ఇద్దరినీ ఎంపిక చేస్తారా? లేక శుభ్‌మన్ గిల్‌కి నాయకత్వం ఇస్తారా? లేదా రోహిత్‌నే కొనసాగిస్తారా? అన్నది తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.