Samsung: ప్రైవసీ డిస్‌ప్లేతో Galaxy S26 Ultra రిలీజ్.. AI ఫీచర్లే హైలైట్!
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ Co. మరోసారి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూకుడు చూపించింది. సాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈవెంట్‌లో కంపెనీ తన కొత్త Galaxy S26 సిరీస్‌ను ఆవిష్కరించింది. ఇందులో భారీ డిస్‌ప్లేతో వచ్చిన Galaxy S26 Ultra ధర 1,300 డాలర్లు, Galaxy S26 Plus 1,100 డాలర్లు, సాధారణ మోడల్ Galaxy S26 900 డాలర్లుగా ప్రకటించారు. ఈ ధరలతో ఇది ఆపిల్ Inc. విడుదల చేయబోయే iPhone 17 సిరీస్‌కు నేరుగా పోటీగా నిలవనుంది. ఈసారి డిజైన్ కంటే AI ఫీచర్లపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు శాంసంగ్ స్పష్టం చేసింది. ముఖ్యంగా Galaxy S26 Ultraలో "Privacy Display" అనే ప్రత్యేక ఫీచర్‌ను తీసుకొచ్చారు.
వివరాలు
65 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
ఈ మోడ్ ఆన్ చేస్తే ఫోన్ స్క్రీన్ పక్క నుంచి చూడటం కష్టమవుతుంది. బ్యాంకింగ్ యాప్‌లు,పాస్‌వర్డ్ ఎంటర్ చేసే సమయంలో ఇది ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. 6.9 అంగుళాల డిస్‌ప్లే, 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ జూమ్ లెన్స్, మెరుగైన నైట్ వీడియో మోడ్‌తో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. 65 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 30 నిమిషాల్లో 75 శాతం వరకు చార్జ్ అవుతుంది. అల్ట్రా మోడల్‌లో S Pen కూడా యథాతథంగా ఉంది. మరోవైపు S26 Plus (6.7 అంగుళాలు), S26 (6.2 అంగుళాలు) మోడళ్లలో కొత్త AI సాఫ్ట్‌వేర్ ట్రిక్స్ జోడించారు. ఫోటో తీసి మాటల్లో చెప్పిన మార్పులను AIతో చేయించే సదుపాయం అందించారు.
వివరాలు
"Hey Plex"తో కొత్త ఎక్స్‌పీరియన్స్..
కాల్ స్క్రీనింగ్, స్కామ్ డిటెక్షన్ వంటి ఫీచర్లు కూడా వచ్చాయి. AI టెక్నాలజీలో భాగంగా Perplexity AI టెక్నాలజీని బిల్ట్-ఇన్‌గా అందిస్తున్నారు. "Hey Plex" అని పలికితే వెంటనే యాక్సెస్ లభిస్తుంది. అలాగే గూగుల్ జెమినై సహాయంతో వాయిస్ కమాండ్ల ద్వారా యాప్‌లలో పనులు ఆటోమేటిక్‌గా పూర్తి చేసే సదుపాయం కల్పించారు. ఉదాహరణకు"Uber బుక్ చేయి"అని చెబితే ఆ ప్రాసెస్‌ను స్వయంగా పూర్తి చేస్తుంది. ఇదే ఫీచర్‌లో ప్రారంభ భాగస్వామిగా Uber Technologies Inc. ఉంది.
వివరాలు
మార్చి 11 నుంచి స్టోర్లలో..
అదనంగా Galaxy Buds 4 Pro, Galaxy Buds 4 అనే కొత్త ఇయర్‌బడ్‌లను కూడా ప్రకటించారు. Buds 4 Pro ధర 249 డాలర్లు, Buds 4 ధర 179 డాలర్లు. ఇవి AirPods Pro 3కి పోటీగా వస్తున్నాయి. అన్ని కొత్త గెలాక్సీ ఉత్పత్తులు వెంటనే ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులోకి వచ్చాయి. మార్చి 11 నుంచి స్టోర్లలో లభించనున్నాయి. మొత్తంగా ఈసారి డిజైన్‌లో పెద్ద మార్పులు లేకపోయినా, AI ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది శాంసంగ్.