Virat Kohli: వన్డేల్లో రెండో ర్యాంక్‌కు చేరుకున్న విరాట్ కోహ్లీ
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవల విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. అలాగే మొదటి స్థానానికి అతి చేరువగా వచ్చాడు! ప్రస్తుతానికి ఈ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. గతంలో నాలుగో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్,అఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్‌ను పక్కన పెట్టి రెండు స్థానాలు ఎగబడ్డాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబరచాడు. రెండు వరుస సెంచరీలు (135, 102),ఒక హాఫ్ సెంచరీ (65*) సాధిస్తూ మొత్తం 302 పరుగులు కొట్టాడు. ఈ ప్రదర్శన ద్వారా అతను సిరీస్‌లో అత్యధిక రన్స్ సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు.
వివరాలు
రోహిత్, విరాట్ మధ్య తేడా కేవలం ఎనిమిది పాయింట్లే
ఈ ఫార్మ్‌తో విరాట్ కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్‌లో 773 పాయింట్లతో రెండవ స్థానానికి చేరాడు. మొదటి స్థానంలో ఉన్న రోహిత్ శర్మ ఖాతాలో 781 పాయింట్లు ఉన్నాయి. రోహిత్, విరాట్ మధ్య తేడా కేవలం ఎనిమిది పాయింట్లే. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కుల్‌దీప్ యాదవ్ మూడు స్థానాలు ఎగబాకి నంబర్ 3 స్థానంలోకి వచ్చాడు. మొదటి స్థానంలో అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఉన్నాడు. రెండవ స్థానంలో ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్‌లో కుల్‌దీప్ యాదవ్ తొమ్మిది వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో అఫ్గానిస్థాన్ క్రికెటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
వివరాలు
ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంక్‌లు
1. రోహిత్ శర్మ (భారత్) - 781 2. విరాట్ కోహ్లీ (భారత్)- 773 3. డెరిల్ మిచెల్ (న్యూజిలాండ్)- 766 4. ఇబ్రహీం జద్రాన్ (అఫ్గానిస్థాన్)- 764 5. శుభ్‌మన్ గిల్ (భారత్)- 723 6. బాబర్ అజామ్ (పాకిస్థాన్) - 722 7. హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్)- 708 8. షాయ్ హోప్ (వెస్టిండీస్)- 701 9. చరిత్ అసలంక (శ్రీలంక)- 690 10. శ్రేయస్ అయ్యర్ (భారత్)- 679