LOADING...
Tamannah: పాక్ క్రికెట‌ర్‌తో పెళ్లి పుకార్లపై స్పందించిన తమన్నా!
పాక్ క్రికెట‌ర్‌తో పెళ్లి పుకార్లపై స్పందించిన తమన్నా!

Tamannah: పాక్ క్రికెట‌ర్‌తో పెళ్లి పుకార్లపై స్పందించిన తమన్నా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2025
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ఇటీవల పెళ్లి పుకార్లు సోష‌ల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. మూడు పదుల వయసు దాటినా ఇంకా వివాహ బంధంలోకి అడుగుపెట్టని తమన్నా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల కొన్ని కథనాలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో తమన్నా వివాహం జరుగనుందని ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో తాను ఒక ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు తమన్నా. ' ఇలాంటి పుకార్లు ఎలా పుడతాయో అర్థం కావడం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక జ్యువెల్లరీ షాప్ ప్రారంభోత్సవానికి అబ్దుల్ రజాక్‌తో కలిసి హాజరయ్యాను.

Details

విరాట్ తో డేటింగ్ పుకార్లపై స్పందన

అంతే కానీ మా మధ్య ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదు. ఆ ఒక్క ఈవెంట్‌కి కలిసి వెళ్లామంటే అది పెళ్లి పుకార్లకు దారితీయడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా, విరాట్ కోహ్లీతో డేటింగ్ పుకార్లపై కూడా ఆమె స్పందించారు. 'విరాట్‌ను నా జీవితంలో ఒక్కసారి మాత్రమే కలిశాను. కానీ అప్పుడే రూమర్లు మొదలయ్యాయి. ఆ సమయంలో మానసికంగా తీవ్రంగా ప్రభావితమయ్యాను. నిజానికి ఆ తర్వాత మళ్లీ ఆయన్ను కలిసే అవకాశం కూడా రాలేదని తమన్నా తెలిపారు. ఇప్పటికీ తమన్నా పెళ్లి, వ్యక్తిగత జీవితంపై అనేక పుకార్లు నెట్టింట చక్కర్లు కొడుతున్న తరుణంలో ఆమె ఇచ్చిన ఈ స్పష్టతతో వాటన్నింటికి చెక్ పడినట్టే.

Details

విజయ్ వర్మతో బ్రేకప్?

కొంతకాలం క్రితం విజ‌య్ వర్మతో డేటింగ్‌లో ఉన్న‌ట్టు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి పబ్లిక్ ప్లేసుల్లో తిరిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. కానీ అకస్మాత్తుగా బ్రేకప్ చెప్పుకున్నట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ విషయం మీద ఇద్దరూ కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.