LOADING...
Arun Dhumal: 'రో-కో' శకం ఇంకా కొనసాగుతుంది.. వాళ్లు ఎక్కడికీ వెళ్లరు: ఐపీఎల్ ఛైర్మన్ ధుమాల్
'రో-కో' శకం ఇంకా కొనసాగుతుంది.. వాళ్లు ఎక్కడికీ వెళ్లరు: ఐపీఎల్ ఛైర్మన్ ధుమాల్

Arun Dhumal: 'రో-కో' శకం ఇంకా కొనసాగుతుంది.. వాళ్లు ఎక్కడికీ వెళ్లరు: ఐపీఎల్ ఛైర్మన్ ధుమాల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2025
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా సీనియర్ స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల యుగం ముగిసిందని భావిస్తున్న విమర్శకులకు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఘాటుగా సమాధానమిచ్చారు. 'రో-కో' జోడీ ఇప్పటికీ భారత క్రికెట్‌కి కీలక స్తంభాలని, వారు సమీప భవిష్యత్తులో రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఇద్దరు సీనియర్లు ఇప్పటికే 2027 ప్రపంచకప్‌ను లక్ష్యంగా పెట్టుకున్నారని ధుమాల్ వెల్లడించారు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ చూపిన అద్భుత ప్రదర్శన, కఠిన శ్రమ తనను ఎంతవరకు ముందుకు నడిపిస్తోందో నిరూపించిందని ఆయన ప్రశంసించారు. భారత జట్టు బెంచ్ స్ట్రెంత్‌ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. కానీ మరోవైపు రోహిత్, కోహ్లీ వంటి దిగ్గజాలు ఇంకా జట్టులో ఉన్నారు.

Details

భారత క్రికెట్ కు శుభ సూచకం

చాలామంది వాళ్లు వెళ్లిపోతున్నారని అనుకుంటున్నారు. కానీ వారు ఎక్కడికీ వెళ్లడం లేదు. ఇంకా ఇక్కడే కొనసాగుతారని ధుమాల్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అలాగే భారత జట్టు భవిష్యత్తు బలం గురించి మాట్లాడుతూ 14 ఏళ్ల యువ ప్రతిభ వైభవ్ సూర్యవంశీ వంటి వారు జట్టు తలుపు తడుతున్నారు. ఇది భారత క్రికెట్‌కు ఒక శుభ సూచకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను ఉదాహరణగా చూపిస్తూ ధుమాల్ అన్నారు. ఈ వయసులో కూడా రోహిత్ తన క్లాస్‌ను మళ్లీ చాటుకున్నాడు.

Details

అద్భుత ఫామ్ లో రోహిత్ శర్మ

చివరి మ్యాచ్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', సిరీస్ ముగిసే సరికి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు గెలుచుకోవడం అతని పట్టుదల, కఠోర శ్రమకు నిదర్శనం. భారత క్రికెట్ కోసం వారు తమ జీవితాన్ని అంకితం చేశారని ఆయన కొనియాడారు. ఆసీస్ సిరీస్‌లో రోహిత్ శర్మ అద్భుత ఫామ్ కనబరిచాడు. తొలి వన్డేలో విఫలమైనా, రెండో వన్డేలో అర్ధశతకంతో రాణించాడు. సిడ్నీలో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో అజేయ శతకంతో (121 నాటౌట్‌) జట్టుకు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (74 నాటౌట్‌) కూడా రాణించడం గమనార్హం.

Details

తన

ఈ సిరీస్‌లో మొత్తం 202 పరుగులు చేసిన రోహిత్, తన కెరీర్‌లో తొలిసారిగా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్, టీమిండియా యువతార శుభ్‌మన్ గిల్‌లను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించాడు. మొత్తం మీద రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్, ఫిట్‌నెస్ స్థాయిలు, అలాగే ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ వంటి ఉన్నతాధికారుల మద్దతు చూస్తుంటే — ఈ ఇద్దరు దిగ్గజాల ప్రస్థానం 2027 ప్రపంచకప్ వరకు సజావుగా కొనసాగుతుందని స్పష్టమవుతోంది.