Virat Kohli: రెండేళ్లుగా ఇంత ఫ్రీగా ఆడలేదు.. కోహ్లీ కీలక వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా అద్భుత ప్రదర్శనతో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. సఫారీ జట్టు నిర్ణయించిన 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 39.5 ఓవర్లలో, ఒక్క వికెట్ కోల్పోయి పూర్తి చేసింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (116*) అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు, రోహిత్ శర్మ (75), విరాట్ కోహ్లీ (65*) అర్ధశతకాలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషఇంచారు. జైస్వాల్ తన ఇన్నింగ్స్‌లో 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. రోహిత్ శర్మ 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదాడు.
Details
జట్టు విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది
కోహ్లీ వేగంగా ఆడుతూ 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. సిరీస్‌లో విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో మొత్తం 302 పరుగులు చేసి, తనకు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడారు. నా బ్యాటింగ్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. గడిచిన2-3ఏళ్లలో ఇంత స్వేచ్ఛగా ఆడినట్లు అనిపించలేదు. మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌ను మన వైపు తిప్పగలననే ఆత్మవిశ్వాసం నాకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లు మనలోని అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తెస్తాయి. సిరీస్ 1-1తో సమమైనప్పుడు, జట్టు కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని రోహిత్‌తో కలిసి నిర్ణయించాం. జట్టు విజయంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని వివరించారు.