Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ.. రింకు సింగ్ సెంచరీ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ అర్ధశతకాలు
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ హజారే ట్రోఫీ భాగంగా జరిగిన కొన్ని ఉత్కంఠభరిత మ్యాచ్‌లు ఇటీవల ముగిశాయి. రాజ్‌కోట్ వేదికగా ఉత్తరప్రదేశ్, చంఢీగఢ్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన చంఢీగఢ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఉత్తరప్రదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 367 పరుగులు సాధించింది. ఆర్యన్ జుయల్ 118 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 134 రన్స్ చేసి సెంచరీ సాధించగా, రింకు సింగ్ 60 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 106* రన్స్ చేసి సెంచరీ కొట్టాడు. ధ్రువ్ జురెల్ 57 బంతుల్లో 11 ఫోర్లు వేసి 67 రన్స్ చేసి హాఫ్‌సెంచరీ సాధించాడు.
Details
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి
చంఢీగఢ్ బౌలర్లలో తరణ్‌ప్రీత్ సింగ్ 2, నిశుంక్ బిర్లా, సందీప్ శర్మ ఒకో వికెట్ తీశారు. జైపూర్ వేదికగా ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 331 పరుగులు సాధించింది. గత మ్యాచ్‌లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. హార్దిక్ తామోర్ 93 రన్స్‌తో త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ 55, అతని సోదరుడు ముషీర్ ఖాన్ 55 రన్స్‌తో అర్ధశతకాలు నమోదు చేసారు.
Details
రాణించిన విరాట్ కోహ్లీ, పంత్
బెంగళూరు వేదికగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 77 రన్స్ చేసి హాఫ్‌సెంచరీ సాధించగా, రిషభ్ పంత్ 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70 రన్స్ చేసి హాఫ్‌సెంచరీ సాధించారు.