Virat Kohli: ఆసీస్ ప్లేయర్ల నుంచి ప్రశంసలు రావడం చాలా అరుదు.. కోహ్లీపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారీ శతకం నమోదు చేశాడు. ఇది అతడి కెరీర్‌లో 52వ సెంచరీ. దీంతో ఒకే ఫార్మాట్‌లో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు బాదిన క్రికెటర్‌గా కోహ్లీ కొత్త రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డ్ టెస్టుల్లో 51 సెంచరీలు చేసిన సచిన్ టెండుల్కర్ పేరుపై ఉండేది. ఇప్పటికే వన్డేల్లో సచిన్ అత్యధిక శతకాల (49) రికార్డును కోహ్లీ అధిగమించిన విషయం తెలిసిందే. కోహ్లీ ఈ ఘనతపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. విరాట్‌తో ఆడిన ప్రతి ఒక్కరూ అతడే వన్డే ఫార్మాట్‌లో గ్రేటెస్ట్ అని అంగీకరించారు.
Details
ప్రస్తుతం వన్డే క్రికెట్ పైనే దృష్టి
రికీ పాంటింగ్ కూడా వన్డేల్లో విరాట్ బెస్ట్ అని అన్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ల నుంచి పొగడ్తలు రావడం అంత ఈజీ కాదు. అతడు సచిన్ రికార్డులను అధిగమించాడంటేనే కోహ్లీ ఎక్కడ ఉన్నాడో అర్థం అవుతుందని గావస్కర్ పేర్కొన్నాడు. ఈ మధ్యే టీ20, టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, ప్రస్తుతం పూర్తిగా వన్డే క్రికెట్‌పైనే దృష్టి పెట్టాడు. 2027 వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తన తదుపరి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.
Details
డిసెంబర్ 3న రాయ్‌పుర్‌లో మూడో వన్డే
కొన్ని నెలల విరామం తర్వాత కోహ్లీ ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అయితే ఆ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన కోహ్లీ, మూడో వన్డేలో హాఫ్‌సెంచరీతో తిరిగి ఫామ్ అందుకున్నాడు. ప్రస్తుత సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్‌పుర్‌లో జరగనుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ సిరీస్‌ను 1-0తో లీడ్ చేస్తోంది.