Rohit-Virat: రోహిత్-విరాట్ దుమ్ము రేపారు.. చీఫ్ సెలెక్టర్‌పై ఫ్యాన్స్ ఫైర్!
ఈ వార్తాకథనం ఏంటి
గొప్ప ఆటగాళ్లు తమ ప్రతిభతోనే సమాధానం చెబుతారు. ఈ మాటను టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరోసారి రుజువు చేశారు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఈ ఇద్దరి ఫామ్‌పై ఎన్నో విమర్శలు, సందేహాలు వ్యక్తమయ్యాయి. కొందరు వారిని పాతబడి పోయిన ఆటగాళ్లుగా అభివర్ణించారు. కానీ ఆస్ట్రేలియా సిరీస్ ముగిసే సరికి అదే విమర్శకులు మౌనం వహించాల్సి వచ్చింది. ఎందుకంటే రోహిత్, విరాట్ తమ బ్యాటింగ్‌తోనే సమాధానం చెప్పారు. అయితే, ఈ ఇద్దరి అద్భుత ప్రదర్శన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు మాత్రం ఇబ్బంది కలిగించింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో, అభిమానులు అగార్కర్‌ను ఎగతాళి చేస్తూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
Details
జట్టు ఎంపిక సమయంలో అజిత్ కీలక వ్యాఖ్యలు
అగార్కర్ భయ్యా! రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పరుగులు చేశారు కదా.. ఇప్పుడు వాళ్లను ఎలా ఆపుతారు? 2027 ప్రపంచకప్‌లో ఆడకుండా ఎలా నిరోధిస్తారు?" అంటూ ఆయనను చుట్టుముట్టారు. చివర్లో రోహిత్, కోహ్లీ షేక్ చేశారు.. అగార్కర్ పారిపోతున్నాడు భయ్యా! అంటూ అభిమానులు హాస్యాస్పదంగా వ్యాఖ్యానించారు. ఈ ప్రతిస్పందనకు కారణం రోహిత్, విరాట్ ప్రదర్శన మాత్రమే కాదు, పర్యటనకు ముందు జట్టు ఎంపిక సమయంలో అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించడం, 2027 ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు ఆడతారా అనే ప్రశ్నకు స్పష్టత ఇవ్వకపోవడం అభిమానుల్లో అసంతృప్తిని కలిగించింది.
Details
సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డు
ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ అత్యుత్తమ ఫామ్‌లో కనిపించాడు. సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అంతేకాదు, సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడు కూడా ఆయనే. ఆయన 101 సగటుతో రాణించగా, ఐదు సిక్సర్లతో ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చూపించాడు. విరాట్ కోహ్లీ విషయానికి వస్తే, సిరీస్‌లో తొలి రెండు ఇన్నింగ్స్‌లలో డక్ అయినప్పటికీ, సిడ్నీలోని చివరి మ్యాచ్‌లో అజేయంగా 74 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఆ ఇన్నింగ్స్ ఆధారంగా ఆయన సిరీస్‌లో మూడవ అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
Fan to Agarkar - Virat and Rohit have scored runs, now how will you stop them from playing the 2027 World Cup?
— ` (@KohliHood) October 26, 2025
He said Agarkar why are you running RO KO ne hila diya kya 😭😂 pic.twitter.com/Oc1b3rper2