LOADING...
Virat Kohli: వరుసగా రెండు డకౌట్‌లు.. విరాట్‌ కోహ్లీ కెరియర్‌లోనే తొలిసారి..!
వరుసగా రెండు డకౌట్‌లు.. విరాట్‌ కోహ్లీ కెరియర్‌లోనే తొలిసారి..!

Virat Kohli: వరుసగా రెండు డకౌట్‌లు.. విరాట్‌ కోహ్లీ కెరియర్‌లోనే తొలిసారి..!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2025
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ మరోసారి అభిమానులను నిరుత్సాహపరిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో దాదాపు ఏడు నెలల తర్వాత తిరిగి అడుగు పెట్టిన కోహ్లీ, మ్యాచ్‌లో కనీసం ఒక పరుగైన చేయకపోవడం గమనార్హం. విరాట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ, వాటిని అందుకోవడంలో విఫలమయ్యాడు. పెర్త్ వన్డేలో కోహ్లీ 8 బంతులు ఆడినప్పటికీ ఖాతా తెరవలేదు. ఇప్పుడు తనకు కలిసొచ్చే అడిలైడ్‌లోనూ ఇబ్బంది పడ్డాడు. నాలుగు బంతుల్లోనే వికెట్‌ కోల్పోయి, భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాడు. వన్డే కెరీర్‌లో ఇలా వరుసగా రెండు మ్యాచ్‌లలో డకౌట్ కావడం అతనికి తొలిసారి. ఈ చెత్త రికార్డును కోహ్లీ ఇప్పుడు ఖాతాలో వేసుకున్నాడు.

వివరాలు 

ఈ సిరీస్‌లో ఔట్ అయ్యిందిలా.. 

భారత-ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే పెర్త్‌లో జరిగింది. వర్షం పలుమార్లు ఆటకు అంతరాయం కలిగించినా చివరికి ఆసీస్‌నే విజయం వరించింది. ఆ మ్యాచ్‌లో విరాట్ ఆఫ్‌సైడ్‌ బంతిని కదిలించి వికెట్ ఇచ్చాడు. మిచెల్ స్టార్క్‌ సంధించిన బంతిని ఆడబోయి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఫీల్డర్‌కు చిక్కాడు. ఇప్పుడు అడిలైడ్‌లోనూ రన్ చేయకుండానే కోహ్లీ వికెట్‌ కోల్పోయాడు. ఈసారి బార్ట్‌లెట్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. కనీసం డీఆర్‌ఎస్‌ కూడా తీసుకోకపోవడం గమనార్హం. పెవిలియన్‌కు వెళ్తూ అభిమానులకు అభివాదం చేయడంతో కొత్త చర్చ మొదలైంది. ఈ సిరీస్‌ తర్వాత కోహ్లీ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు చెబుతాడా? అనే సందేహం అభిమానుల మనసులో నెలకొంది. సోషల్ మీడియాలో ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అడిలైడ్‌లో అభిమానులను నిరుత్సాహపరిచిన విరాట్