LOADING...
Virat Kohli: భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి ఇంగ్లాండ్‌లో ఫిట్‌నెస్ పరీక్ష 
భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి ఇంగ్లాండ్‌లో ఫిట్‌నెస్ పరీక్ష

Virat Kohli: భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి ఇంగ్లాండ్‌లో ఫిట్‌నెస్ పరీక్ష 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2025
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.జట్టు ఫిట్‌నెస్‌ను మరింత మెరుగుపరచేందుకు బీసీసీఐ యోయో టెస్ట్‌ తోపాటు బ్రాంకో టెస్ట్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే రోహిత్ శర్మ, శుభమన్ గిల్,యశస్వి జైస్వాల్ సహా పలువురు ఆటగాళ్లు ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాల్గొన్నారు. తాజాగా విరాట్ కోహ్లీ కూడా ఫిట్‌నెస్ పరీక్షలకు సిద్ధమయ్యాడు. అయితే, కోహ్లీ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో హాజరు కావడం లేదు. క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం, అతను లండన్‌లోనే ఫిట్‌నెస్ టెస్ట్‌లు పూర్తి చేయనున్నారు. ప్రస్తుతానికి కోహ్లీ తన కుటుంబంతో అక్కడే ఉన్నారు. BCCI నుండి కూడా ఈ ప్రత్యేక అనుమతి మంజూరు చేయబడిందని సమాచారం ఉంది.

వివరాలు 

విరాట్,రోహిత్ అక్టోబర్‌లో జరగబోయే ఆసీస్ వన్డే సిరీస్‌పై దృష్టి

ఈ నిర్ణయం తర్వాత సమాజంలో,"అన్ని ఆటగాళ్లకు ఒకే విధమైన ప్రొటోకాల్ ఉండాలి,కొందరికి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం సరైనది కాదు"అని చర్చలు ఉత్పన్నమయ్యాయి. విరాట్ కోహ్లీ ప్రస్తుత పరిస్థితి వన్డే సిరీస్‌కు సంబంధించినదే. అతను ఇప్పటికే టెస్టు,టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. కేవలం వన్డేల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.ప్రస్తుతం యువ భారత్‌ ఆసియా కప్‌ కోసం సిద్ధమవుతుంటే,సీనియర్లు విరాట్,రోహిత్ అక్టోబర్‌లో జరగబోయే ఆసీస్ వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టారు. ఈఫిట్‌నెస్ టెస్ట్‌లకు ముఖ్య కారణం అదే.జాతీయ జట్టులో స్థానం సంపాదించాలంటే,ప్రతి ఆటగాడికి ఫిట్‌నెస్ నిర్ధారించుకోవడం తప్పనిసరి. దేశవాళీ క్రికెట్‌లో కూడా ఆడే అవకాశం ఉండాలంటే ఫిట్‌నెస్ టెస్ట్ అవసరం.డొమిస్టిక్ క్రికెట్‌లో మాత్రమే ఆడిన ఆటగాళ్లకు ఈ టెస్ట్‌లు ఇప్పటికీ అవసరం లేదు.

వివరాలు 

కోహ్లీ ముందస్తు అనుమతి

ఇప్పుడు కోహ్లీ కూడా లండన్‌లోనే ఉండటంతో అక్కడే హాజరవుతాడని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. అదేవిధంగా,కోహ్లీ ముందస్తు అనుమతి తీసుకున్నారని స్పష్టంచేశారు.BCCI వైద్య బృందం సబ్మిట్ చేసిన రిపోర్ట్‌లను పరిశీలించి,బోర్డు వద్ద నివేదిస్తుందని తెలిపారు. ఫిట్‌నెస్ టెస్ట్‌లు రెండు దశల్లో నిర్వహిస్తారు.తొలి దశలో ఆసియా కప్‌కు ఎంపికైన క్రికెటర్లు,రోహిత్ శర్మ టెస్ట్‌లు పూర్తి చేసుకున్నారు. రెండో దశలో విరాట్ తన ఫిట్‌నెస్ టెస్ట్‌ను పూర్తి చేయనున్నారు.ఆ తర్వాత మరికొందరు ఆటగాళ్లకు రెండో దశలో టెస్ట్‌లు నిర్వహించనున్నారు. ఈలిస్ట్‌లో కేఎల్ రాహుల్,నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా,రిషబ్ పంత్ హాజరు కావాల్సి ఉంది. ప్రస్తుతం వీరు గాయాలతో సమస్యలు ఎదుర్కొంటున్నారు.వారి పరిస్థితిని బట్టి రాబోయే ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం ఎంపిక చేసేందుకు అవకాశం ఉంది.