LOADING...
IND vs AUS: టీమిండియాకు ఆస్ట్రేలియా వార్నింగ్ బెల్.. స్టార్క్-హేజెల్‌వుడ్ కఠిన జోడీతో స్క్వాడ్ ప్రకటించిన ఆస్ట్రేలియా
టీమిండియాకు ఆస్ట్రేలియా వార్నింగ్ బెల్.. స్టార్క్-హేజెల్‌వుడ్ కఠిన జోడీతో స్క్వాడ్ ప్రకటించిన ఆస్ట్రేలియా

IND vs AUS: టీమిండియాకు ఆస్ట్రేలియా వార్నింగ్ బెల్.. స్టార్క్-హేజెల్‌వుడ్ కఠిన జోడీతో స్క్వాడ్ ప్రకటించిన ఆస్ట్రేలియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 07, 2025
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్ల స్టార్‌ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆస్ట్రేలియా టూర్‌కి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా కూడా తాము గేమ్ ప్లాన్ పూర్తి చేసుకుని టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్యాట్ కమిన్స్ గాయంతో దూరంగా ఉన్నందున, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్‌లను ప్రధాన బౌలింగ్ జోడీగా చేర్చారు. మిచెల్ మార్ష్ నాయకత్వంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వన్డే, టీ20స్క్వాడ్‌ను ప్రకటించింది. స్టార్క్-హేజిల్‌వుడ్ జంట గతంలో విరాట్, రోహిత్‌లకు కఠిన సవాళ్లు గుర్తుచేసుకుంటే, ఈసారి సిరీస్ మరింత ఉత్కంఠభరితంగా ఉండనుందని అంచనా. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20లు జరుగనుండగా, వన్డేలు పెర్త్, అడిలైడ్,సిడ్నీ వేదికలపై, టీ20లు కాన్బెరా, మెల్‌బోర్న్,హోబార్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ వేదికలపై జరగనున్నాయి.

Details

రెండు సంవత్సరాల తర్వాత చోటు సంపాదించుకున్న మాథ్యూ రెన్షా

ఆస్ట్రేలియా బ్యాటర్ మాథ్యూ రెన్షా రెండు సంవత్సరాల విరామం తర్వాత వన్డే జట్టులో చేరారు. అతను ఇటీవల ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్ తరఫున మంచి రన్లు చేసి ఈ అవకాశం పొందాడు. మరోవైపు అలెక్స్ కెరీ తొలి వన్డేలో ఆడటం లేదు, ఎందుకంటే అతను షెఫీల్డ్ షీల్డ్ క్రికెట్ రెండో రౌండ్‌లో పాల్గొంటున్నాడు. జోష్ ఇంగ్లిస్ చిన్న గాయంతో దూరంగా ఉన్న తర్వాత తిరిగి టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. నాథన్ ఎలిస్ తన బిడ్డ పుట్టడంతో తీసుకున్న విరామం తరువాత మళ్లీ అందుబాటులోకి వచ్చాడు.

Details

పాట్ కమిన్స్ దూరం

గ్లెన్ మ్యాక్స్‌వెల్, న్యూజిలాండ్ పర్యటనలో మణికట్టు గాయంతో, తొలి రెండు టీ20లకు దూరంగా ఉంటాడు. కామెరాన్ గ్రీన్ వన్డే సిరీస్ తర్వాత టెస్ట్ సీజన్‌ కోసం వెస్టర్న్ ఆస్ట్రేలియా తరఫున కొనసాగుతాడు. గాయం కారణంగా ప్యాట్ కమిన్స్ టీమిండియా సిరీస్‌లో ఉండడం లేదు, కానీ నవంబర్ 21న ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడు. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ జార్జ్ బెయిలీ ప్రకారం షెఫీల్డ్ షీల్డ్ క్రికెట్ మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకుని, ఆటగాళ్ల వర్క్‌లోడ్‌ను సమానంగా పంచుతూ జట్టు ఎంపిక చేసాము. ప్రధానంగా టీ20 జట్టును కొనసాగిస్తూ, వచ్చే ఏడాది వరల్డ్‌కప్‌కు సరైన ప్రిపరేషన్‌ చేయడం మా లక్ష్యమని తెలిపారు.

Details

ఇరు జట్లలోని సభ్యులు వీరే

ఆస్ట్రేలియా వన్డే జట్టు మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కెరీ, కూపర్ కానోలీ, బెన్ ద్వార్ష్యూస్, నాథన్ ఎలిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జాంపా. టీ20 జట్టు (మొదటి రెండు మ్యాచ్‌లకు) మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్ష్యూస్, నాథన్ ఎలిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కూహ్నెమన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టాయినిస్, ఆడమ్ జాంపా.