LOADING...
AUS vs IND: ఆసీస్‌తో మూడో వన్డే.. రోహిత్ శర్మ సెంచరీ.. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ 
ఆసీస్‌తో మూడో వన్డే.. రోహిత్ శర్మ సెంచరీ.. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ

AUS vs IND: ఆసీస్‌తో మూడో వన్డే.. రోహిత్ శర్మ సెంచరీ.. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 25, 2025
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు ఏడు నెలల విరామం తర్వాత భారత జట్టు తరఫున వన్డేలో ఆడుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆస్ట్రేలియాలో జరుగుతున్న సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో నిరాశ కలిగించారు. వ రుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్స్‌తో అభిమానులను కొంచెం నిరాశపెట్టారు. అయితే సిడ్నీ మైదానంలో జరుగుతున్న మూడో వన్డేలో కోహ్లీ అద్భుత ప్రదర్శనతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. తొలి బంతికే సింగిల్ తీసుకున్న అతను, ఆ తర్వాత బౌండరీలతో పరుగుల వరద పారించారు. ఈ ప్రదర్శనలో 56 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి, తన వన్డే కెరీర్‌లో 75వ హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు.

Details

50వ సెంచరీ పూర్తి చేసిన హిట్ మ్యాన్

మరో ఎండ్‌లో రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేశారు. కేవలం 63 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన రోహిత్, తరువాత 42 బంతుల్లో శతకం తీయడం గమనార్హం. అంతర్జాతీయ కెరీర్‌లో రోహిత్ కోసం ఇది 50వ సెంచరీ. ఇప్పటివరకు ఆయన టెస్టుల్లో 12, వన్డేల్లో 33, టీ20ల్లో ఐదు శతకాలు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం 33 ఓవర్లలో భారత్ స్కోరు 200/1కి చేరింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 236 పరుగులకు ఆలౌటైంది.