
Kohli-Rohit: రోహిత్-విరాట్ కోహ్లీ అభిమానులకు బిగ్ షాక్.. మరో మూడు నెలలు ఆగాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే ఆగస్టులో జరగాల్సిన భారత్-బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం విడుదల చేసిన అధికార ప్రకటన ద్వారా ధ్రువీకరించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)తో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ పేర్కొంది. సిరీస్‌కు సంబంధించిన కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సిరీస్‌ను సెప్టెంబర్ 2026లో నిర్వహించేందుకు బీసీబీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Details
రాజకీయ ఉద్రిక్తతలే ప్రధాన కారణం
బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం, హింసాత్మక ఘటనల దృష్ట్యా ఈ పర్యటనపై ఆందోళనలు మొదటి నుంచి కొనసాగుతున్నాయి. ముఖ్యంగా షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బంగ్లా అంతర్భాగం ఉలిక్కిపడింది. కొన్ని చోట్ల ప్రముఖులపై కూడా దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో భారత జట్టును బంగ్లాదేశ్‌కు పంపించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతిని బీసీసీఐ ఎంతకాలంగా ఎదురు చూసినప్పటికీ, చివరకు భద్రతా కారణాల నేపథ్యంలో పర్యటనను వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆగస్టు 17న మొదలవ్వాల్సిన మూడు వన్డేలు, మూడు టీ20లు పూర్తిగా రద్దయ్యాయి.
Details
రోహిత్, కోహ్లీ ఆటను మిస్ అవుతున్న అభిమానులు
ఈ వాయిదా భారత క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ముఖ్యంగా వన్డేల్లో మాత్రమే అందుబాటులో ఉన్న టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానుల కోసం ఎదురుచూస్తున్న ఈ సిరీస్ వాయిదా కావడంతో వారిని మైదానంలో చూడాలన్న ఆశ చిరునవ్వుగా మిగిలిపోయింది. టెస్ట్, టీ20లకు వీడ్కోలు పలికిన ఈ స్టార్ ఆటగాళ్లు వన్డేల్లో మాత్రం కొనసాగుతుండటంతో, ఈ బంగ్లా పర్యటన వారికి ప్రత్యేకంగా భావించారు అభిమానులు. అయితే, రోహిత్-కోహ్లీ జోడీని మళ్లీ చూడాలంటే ఇంకో మూడు నెలలు ఆగాల్సిందే. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌లో వారిద్దరూ మళ్లీ బరిలోకి దిగనున్నారు.