LOADING...
Virat Kohli: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ

Virat Kohli: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2025
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానాన్ని టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. కోహ్లీ ముందుగా సింహాద్రి అప్పన్నను దర్శించగా, ఆలయ అర్చకులు ఆయనకి వేదాశీర్వచనం చేశారు. అనంతరం అప్పన్న స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అధికారులు కోహ్లీకి అందజేశారు. ఆలయ అధికారులు అతన్ని ప్రత్యేకంగా స్వాగతించారు. కోహ్లీ రాకతో ఆలయంలో సందడి నెలకొంది, భక్తులు తమ అభిమాన క్రికెటర్‌ను చూడటానికి పెద్ద ఎత్తున్న తరలివచ్చారు. కొందరితో కోహ్లీ ఫోటోలు దిగారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోహ్లీకి దైవ భక్తి ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే.

Details

విరాట్ కోహ్లీకి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'

ఏ ప్రాంతానికి వెళ్లినా సమయం ఉన్నపుడు ప్రసిద్ధ దేవాలయాలను సందర్శిస్తుంటాడు. కోహ్లీ క్రికెట్ ప్రదర్శన గురించి చెప్పాలంటే విశాఖ వన్డేలో 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 65 రన్స్ చేసిన అతను నాటౌట్‌గా నిలిచాడు. అలాగే, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో మొత్తం 302 పరుగులు చేసి, 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నాడు.

Advertisement