IND vs NZ: లక్ష్య చేధనలో భారత్ ఆలౌట్.. సిరీస్‌ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 18, 2026
09:35 pm
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్‌కు నిరాశే ఎదురైంది. కివీస్ 41 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (124) శతకంతో వీరోచితంగా పోరాడినా అది వృథాగానే మిగిలింది. నితీశ్ (53), హర్షిత్‌రాణా (52) అర్ధశతకాలతో ఆకట్టుకున్నప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో ఫౌక్స్ 3, క్రిస్టియన్ 3, లనెక్స్ 2, జెమీసన్ 1 వికెట్ తీసి భారత బ్యాటింగ్‌ను కట్టడి చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ
BELIEVE! 🇮🇳#TeamIndia #INDvNZ #3rdODI @IDFCfirstbank pic.twitter.com/iDhHO2Bg7z
— BCCI (@BCCI) January 18, 2026