LOADING...
Virat Kohli Record: జనవరి 11 కోహ్లీకి ప్రత్యేకం.. సచిన్, సంగక్కర రికార్డులు బ్రేక్ అవుతాయా?
జనవరి 11 కోహ్లీకి ప్రత్యేకం.. సచిన్, సంగక్కర రికార్డులు బ్రేక్ అవుతాయా?

Virat Kohli Record: జనవరి 11 కోహ్లీకి ప్రత్యేకం.. సచిన్, సంగక్కర రికార్డులు బ్రేక్ అవుతాయా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2026
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే సిరీస్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్ మధ్య నేడు తొలి వన్డే మ్యాచ్‌ జరగనుంది. వడోదరలో మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్‌ ఆరంభం కానుందని ప్రకటించారు. ఈ మ్యాచ్‌ ప్రత్యేకత ఏమిటంటే, టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించే అవకాశంలో ఉన్నాడు. కేవలం 25 రన్స్ మాత్రమే జోడించుకుంటే, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ యొక్క ప్రపంచ రికార్డు బ్రేక్ అవుతుంది. అలాగే ఈ రోజు విరాట్‌కు మరింత ప్రత్యేకత ఉంది, ఎందుకంటే ఆయన కుమార్తె వామిక పుట్టినరోజు నేడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగులు పూర్తి చేయడానికి విరాట్ కేవలం 25 పరుగుల దూరంలో ఉన్నారు.

Details

42 పరుగుల దూరంలో విరాట్

ఈ మ్యాచ్‌లో ఆ 25 రన్స్‌ చేసినట్లయితే, విరాట్ అత్యంత వేగంగా 28 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా నమోదు అవుతాడు. ఇప్పటివరకు ఈ మైలురాయిని సచిన్ టెండూల్కర్‌, కుమార సంగక్కర మాత్రమే చేరుకున్నారు. విరాట్ 623 ఇన్నింగ్స్‌లలో 84 సెంచరీలు, 145 హాఫ్ సెంచరీలతో 27,975 పరుగులు సాధించారు. సచిన్ 644 ఇన్నింగ్స్‌లలో 28,000 పరుగులు పూర్తి చేశాడు. సంగక్కర 666 ఇన్నింగ్స్‌లలో 28,016 పరుగులు సాధించారు. కోహ్లీ సచిన్ కంటే వేగంగా ఈ రికార్డు సాధించగలరు. కుమార సంగక్కర 28,016 పరుగుల రికార్డును బద్దలు కొట్టడానికి విరాట్ ఇంకా 42 పరుగుల దూరంలో ఉన్నారు.

Details

రెండో బ్యాటర్ గా రికార్డు

ఈరోజు విరాట్ హాఫ్ సెంచరీ సాధిస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాట్స్‌మన్‌గా నిలుస్తారు ప్రస్తుత స్ధితిలో సంగక్కర కోహ్లీ కంటే ముందున్నారు. సంగక్కర 594 మ్యాచ్‌లలో 666 ఇన్నింగ్స్‌లలో 28,016 పరుగులు సాధించారు. ఆయన సగటు 46.77, 63 సెంచరీలు, 153 హాఫ్ సెంచరీలతో ఘన రికార్డు వేసారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా సచిన్ టెండూల్కర్ కొనసాగుతారు. ఆయన 664 మ్యాచ్‌లలో 48.25 సగటుతో 34,357 పరుగులు సాధించారు, అన్ని ఫార్మాట్లలో 100 సెంచరీలు, 164 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.

Advertisement

Details

న్యూజిలాండ్ తో కోహ్లీకి అద్భుత రికార్డు

న్యూజిలాండ్‌తో వన్డేల్లో విరాట్ కోహ్లీకి అద్భుత రికార్డు ఉంది. 2010-2025 మధ్య 33 మ్యాచ్‌లలో 6 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలతో 1,657 పరుగులు సాధించారు. విరాట్ అత్యధిక స్కోరు 154 నాటౌట్. 2025లో న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో విరాట్ కేవలం 1 పరుగుతో ఔటయ్యాడు. అయితే ప్రస్తుత ఫామ్‌లో విరాట్ అద్భుతంగా ఉన్నారు. దక్షిణాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో మొత్తం 302 పరుగులు సాధించారు.

Advertisement