LOADING...
Virat Kohli: ఆసీస్‌తో త్వరలో వన్డే సిరీస్.. నెట్స్‌ ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన విరాట్ కోహ్లీ!
ఆసీస్‌తో త్వరలో వన్డే సిరీస్.. నెట్స్‌ ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన విరాట్ కోహ్లీ!

Virat Kohli: ఆసీస్‌తో త్వరలో వన్డే సిరీస్.. నెట్స్‌ ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన విరాట్ కోహ్లీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2025
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ వన్డేల్లో పునరాగమనం కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కోహ్లీ లార్డ్స్‌లోని ఇండోర్‌ నెట్స్‌లో దాదాపు రెండు గంటలపాటు బ్యాటింగ్ సాధన నిర్వహించి, స్పిన్‌, ఫాస్ట్‌ బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. టెస్ట్‌ క్రికెట్‌లో కూడా ఇటీవలే వీరిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. అభిమానులు 2027 వన్డే ప్రపంచకప్ వరకు వీరిద్దరూ టీమ్‌లో కొనసాగాలని కోరుతున్నారు. అయితే ఆ తర్వాత రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.కానీ ఈఊహలను బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఖండించారు.

Details

రోహిత్ అద్భుతంగా రాణిస్తున్నారు

ఒక కార్యక్రమంలో, సచిన్ తెందూల్కర్‌లా రోహిత్, కోహ్లీకి ఫేర్‌వెల్ ఇవ్వబోతారా అని హోస్ట్ అడిగినప్పుడు, శుక్లా స్పందిస్తూ వారు ఎప్పుడు రిటైర్ అవుతున్నారు? రోహిత్, విరాట్ ఇప్పటికీ వన్డేల్లో ఆడుతున్నారు. ఎందుకు ఫేర్‌వెల్ గురించి ముందుగానే మాట్లాడాలి? విరాట్ ఇంకా ఫిట్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ అద్భుతంగా పరుగులు సాధిస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 302 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన కోహ్లీ 14,181 పరుగులు సాధించాడు. వీటిలో 51 శతకాలు, 74 అర్ధశతకాలు ఉన్నాయి. అతడి అత్యధిక వన్డే స్కోరు 183. 123 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 9,230 పరుగులు, 30 సెంచరీలు, 31 హాఫ్‌ సెంచరీలతో కోహ్లీ అత్యధిక స్కోరు 254* సాధించాడు.