
Asia Cup: ఆసియా కప్‌లో టాప్ స్కోరర్స్ వీరే.. ఆగ్రస్థానంలో టీమిండియా ప్లేయర్!
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే వారం నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్ 2025 టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. ఈ టోర్నీలో జట్ల ఉద్దేశ్యం వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందుగా మెరుగైన ప్రిపరేషన్ చేయడం. ఇప్పుడు, గత ఆసియా కప్ టీ20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల వివరాలు చూడవచ్చు. అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు విరాట్ కోహ్లీ. టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లీ ఈసారి ఆడడంలేదు. ఆసియా కప్‌లో 10 మ్యాచ్‌లలో 429 పరుగులు చేసి, సగటు 85.80ను సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 122 నాటౌట్. రెండో స్థానంలో మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్) నిలిచాడు.
Details
మూడో స్థానంలో రోహిత్ శర్మ
ఆరు మ్యాచ్‌లలో 281 పరుగులు చేసి, సగటు 56.20. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈసారి రిజ్వాన్ పాక్ జట్టులో చోటు దక్కలేదు. మూడో స్థానంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. 9 మ్యాచ్‌లలో 271 పరుగులు చేసి, సగటు 30.11. రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోరు 83. నాల్గో స్థానంలో హాంకాంగ్ ఆటగాడు బాబర్ హయత్. ఐదు మ్యాచ్‌లలో 235 పరుగులు చేసి, సగటు 47. ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో అతని అత్యధిక స్కోరు 122. ఐదో స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్. ఐదు మ్యాచ్‌లలో 196 పరుగులు, సగటు 65.33. ఇందులో 64 పరుగులతో అజేయ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఉంది.