
Virat Kohli: వన్డేలకు రిటైర్మెంట్ అంటూ రూమర్స్.. విరాట్ కోహ్లీ పోస్టు వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
టీ20లు, టెస్టులు వీడ్కోలు చెప్పిన తర్వాత వన్డేల్లో మాత్రమే ఆడుతున్నస్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మళ్లీ తన ఆటతో అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాడు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం కోహ్లీ భారత జట్టులో ఎంపిక అయ్యాడు. ఇప్పటికే జట్టుతో కలసి ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. 2027లో వన్డే ప్రపంచకప్ ఆడాలనుకునే కోహ్లీకి ఈ సిరీస్ చాలా కీలకమని మాజీ క్రికెటర్లు, ముఖ్యంగా రవి శాస్త్రి, అభిప్రాయపడ్డారు. ఈ సిరీస్‌లో విఫలమైతే, కోహ్లీ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు లేకపోలేదని ప్రచారం జరుగుతోంది
వివరాలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోహ్లీ పోస్టు
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతోంది. 'మనం ఎప్పుడైతే చేతులెత్తేస్తామో అప్పుడు మాత్రమే మనకు ఓటమి వస్తుంది' అనే అర్థం వచ్చేలా విరాట్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కోహ్లీ మాటల వెనక ఉన్న అంతర్యంపై ఫ్యాన్స్ రకరకాల ఊహగానాలు చేస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనే పట్టుదలతో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ టోర్నీలో ఆడిస్తామనే గ్యారెంటీ మాత్రం వాళ్లకు దక్కట్లేదు. టీమిండియా కోచ్ గంభీర్ కూడా రో-కో భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వడానికి నిరాకరించాడు.
వివరాలు
వారి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది: గంభీర్
"50 ఓవర్ల ప్రపంచకప్‌కు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. కాబట్టివర్తమానంపై దృష్టిపెట్టడం అవసరమన్నాడు. రోహిత్, కోహ్లీ ఇద్దరూ నాణ్యమైన ఆటగాళ్లు. ఆస్ట్రేలియా పర్యటనలో వారి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. రోహిత్, కోహ్లీ అక్కడ విజయవంతమవుతారని ఆశిస్తున్నా'' అని గంభీర్ తెలిపాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కోహ్లీ చేసిన ట్వీట్
The only time you truly fail, is when you decide to give up.
— Virat Kohli (@imVkohli) October 16, 2025